న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రైనాకు రెండు సిక్సులు, రాహుల్‌కు 67 రన్స్, ధోనీకి 2 ఔట్‌లు! ఈ త్రయం బద్దలు కొట్టనున్న రికార్డులు ఇవే!

PBKS vs CSK: Suresh Raina need 2 sixes to complete 200 sixes in IPL

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021‌లో భాగంగా ఎనిమిదో మ్యాచ్ ఈ రోజు రాత్రి ఆరంభం కాబోతోంది. టీమిండియా మాజీ కేప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. కేఎల్ రాహుల్ కేప్టెన్సీ వహిస్తోన్న పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ రాత్రి 7:30 గంటలకు ముంబై వాంఖెడే స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. ఇరు జట్లకు ఈ సీజన్‌లో ఇది రెండో మ్యాచ్. చెన్నై పాయింట్ల పట్టికలో ఆఖరు స్థానంలో ఉండగా.. పంజాబ్‌ మూడో స్థానంలో ఉంది. అద్భుతాలు చేయడం అలవాటని ముద్రపడిన ధోనీసేన ఈ మ్యాచ్‌లో ఏంచేస్తుందో చూడాలి. ఇక ఈ మ్యాచులో నమోదవనున్న రికార్డులను ఓసారి పరిశిలిద్దాం.

 IPL 2021: ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. జట్టును నడిపించడం కష్టం: గంభీర్‌ IPL 2021: ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. జట్టును నడిపించడం కష్టం: గంభీర్‌

రైనా రెండు సిక్సులు బాదితే:

రైనా రెండు సిక్సులు బాదితే:

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్‌ సురేశా రైనాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. పంజాబ్ కింగ్స్‌తో ఈరోజు జరుగనున్న మ్యాచులో రైనా రెండు సిక్సులు బాదితే.. ఈ క్యాష్ రిష్ లీగ్‌లో 200 సిక్స్ మార్క్‌ను అందుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో 200 సిక్సులు బాదిన 6వ బ్యాట్స్‌మన్‌గా రైనా నిలవనున్నాడు. ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ విధ్వసంకర వీరుడు, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 351 సిక్సులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఏబీ డివిలియర్స్ (237), ఎంఎస్ ధోనీ (216), రోహిత్ శర్మ (215), విరాట్ కోహ్లీ (201) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

రాహుల్‌కు మరో 67 పరుగులు:

రాహుల్‌కు మరో 67 పరుగులు:

టీ20 క్రికెట్‌లో 5000 పరుగులు పూర్తి చేయడానికి పంజాబ్ కింగ్స్ సారథి కేఎల్ రాహుల్‌కు మరో 67 పరుగులు అవసరం. రాహుల్ 82 ఐపీఎల్ మ్యాచులలో 2738 రన్స్.. 49 మ్యాచులు టీమిండియా తరఫున ఆడి 1557 పరుగులు చేశాడు. మొత్తంగా టీ20ల్లో 4 సెంచరీలు రాహుల్ బాదాడు. ఐపీఎల్‌లో 150 ఔట్‌లలో భాగం అవ్వడానికి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇంకా రెండు కావాలి. మహీ ఇప్పటికే 39 స్టంపింగ్‌లు,109 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక చెన్నై ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్‌కు‌ ఐపీఎల్‌లో 50 వికెట్లు పూర్తి చేయడానికి ఇంకో 2 వికెట్లు అవసరం.

ఆ రికార్డులు అందుకోనున్నారా:

ఆ రికార్డులు అందుకోనున్నారా:

కేఎల్‌ రాహుల్‌ వాంఖడేలో గత నాలుగు మ్యాచులూ చితక్కొట్టాడు. మూడుసార్లు 90 పరుగులకు పైగా స్కోర్‌ చేశాడు. ఓ సెంచరీ కూడా బాదాడు. మొత్తంగా అక్కడ అతడి సగటు 75 పైనే ఉంది. అతడి బ్యాటింగ్‌ లయను చూస్తుంటే.. ఈ రోజు మ్యాచ్‌లోనూ దంచడం ఖాయం అనిపిస్తోంది. 2014 సీజన్‌లో పంజాబ్‌పై 25 బంతుల్లో 87 పరుగుల సంచలన ప్రదర్శన చేశాడు సురేష్ రైనా. పంజాబ్‌పై చెన్నై తరఫున అత్యధిక పరుగులూ (711) అతనివే. ఇక ఎంఎస్ ధోనీ కీపర్ కాబట్టి రెండు ఔట్‌లు ఖచ్చితంగా అతని ఖాతాలో చేరనున్నాయి. మొత్తానికి ఈ త్రయం ఈ మ్యాచులోనే ఆ రికార్డులు అందుకోనున్నారు.

14 విజయాలతో చెన్నై మెరుగైన రికార్డు:

14 విజయాలతో చెన్నై మెరుగైన రికార్డు:

ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన 23 ఐపీఎల్‌ మ్యాచులు జరిగాయి. చెన్నై 14 విజయాలతో మెరుగైన రికార్డు కలిగి ఉంది. ఇక 9 మ్యాచుల్లో పంజాబ్‌ నెగ్గింది. గతేడాది జరిగిన రెండు మ్యాచుల్లోనూ ధోనీ సేనదే గెలుపు. మరి ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ప్రతీకారం ఎలా ఉంటుందో చూడాలి. ముంబై పిచ్ టోర్నీ ఆరంభంలో బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా ఉన్నా.. గతరాత్రి స్పిన్నర్లు కూడా అనుకూలించింది. ఢిల్లీ 147 పరుగులే చేసినా.. రాజస్థాన్ కస్టపడి గెలిచింది. మరి ఈరోజు పిచ్ ఎలా ఉండనుందో చూడాలి.

Story first published: Friday, April 16, 2021, 16:46 [IST]
Other articles published on Apr 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X