న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1982 తర్వాత ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు: పవన్‌ షా డబుల్‌ సెంచరీ

By Nageshwara Rao
Pawan Shah scores 282 off 332 balls, breaks multiple records for India U-19 cricket team

హైదరాబాద్: శ్రీలంక అండర్‌-19జట్టుతో చివరిదైన రెండో యూత్‌ టెస్టులో రెండో రోజూ బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో భారత అండర్‌-19 జట్టు పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. పూణెకు చెందిన పవన్‌ షా (332 బంతుల్లో 282; 33 ఫోర్లు, 1 సిక్స్‌) తృటిలో ట్రిపుల్‌ సెంచరీ చేజార్చుకున్నాడు.

తద్వారా అంతర్జాతీయ అండర్‌-19 మ్యాచ్‌ల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. అండర్-19 మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా ఆస్ట్రేలియాకు చెందిన క్లింటన్ పీక్ పేరిట ఉంది. 1995 మార్చిలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో క్లింటన్ (304) పరుగులు నమోదు చేశాడు.

613/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌

613/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌

ఇక, ఈ టెస్టులో భారత్ 128.5 ఓవర్లలో 613/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 428/4తో బుధవారం ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ను శ్రీలంక బౌలర్లు ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. ఓవర్‌నైట్‌ వ్యక్తిగత స్కోరు 177తో క్రీజులోకి వచ్చిన పవన్‌ షా రెండో రోజు కూడా తన దూకుడిని కొనసాగించాడు.

అలవోకగా డబుల్ సెంచరీ పూర్తి

అలవోకగా డబుల్ సెంచరీ పూర్తి

అలవోకగా డబుల్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. ట్రిపుల్‌ సెంచరీ దిశగా సాగాడు. కానీ, ట్రిపుల్ సెంచరీకి సమీపంలో రనౌటై కొద్దిలో చేజార్చుకున్నాడు. పవన్ షా.. వధేరా (64)తో నాలుగో వికెట్‌కు 160 పరుగులు జోడించాడు. యూత్ టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా పవన్ షా నిలిచాడు.

భారత్ తరుపున తొలి డబుల్ సెంచరీ తన్మయ్ శ్రీవాత్సవ్‌దే

భారత్ తరుపున తొలి డబుల్ సెంచరీ తన్మయ్ శ్రీవాత్సవ్‌దే

సెప్టెంబర్ 2006లో పాకిస్థాన్‌తో పెషావర్ వేదికగా జరిగి టెస్టులో తన్మయ్ శ్రీవాత్సవ్ (220) పరుగులతో తొలి డబుల్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు, లంక సీమర్‌ విచిత్ర పెరీరా వేసిన ఇన్నింగ్స్‌ 108వ ఓవర్‌లో పవన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి సత్తాచాటాడు. తొలి బంతిని బౌండరీగా మలచడం ద్వారా డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్న పవన్‌ అదే జోరులో మిగతా ఐదు బంతులను బౌండరీకి తరలించాడు. దీంతో పవన్ షా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 1982 తర్వాత ఒకే ఓవర్లో ఆరు బౌండరీలు బాదిన ఆటగాడిగా నిలిచాడు.

1982 తర్వాత ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు

1982 తర్వాత ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు

1982లో మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బాబ్ విల్లీస్ బౌలింగ్‌లో సందీప్ పాటిల్ ఆరు బంతుల్లో ఆరు బౌండరీలు బాదాడు. ఈ ఓవర్‌లో పాటిల్ బౌండరీల దెబ్బకు బాబ్ విల్లీస్ ఏడు బంతులు వేశాడు. ఇందులో ఒక నో బాల్ ఉండటం విశేషం. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బుధవారం ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది.

Story first published: Thursday, July 26, 2018, 11:00 [IST]
Other articles published on Jul 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X