న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత జాతీయ జెండాలు తప్ప వేటికీ అనుమతివ్వలేదు!!

Party flags, caps banned in cricket stadium renamed after Atal Bihari Vajpayee

హైదరాబాద్: వెస్టిండీస్‌తో టీమిండియా ఆడిన మ్యాచ్‌లన్నింటి కంటే రెండో టీ20 వేదికలో ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. మంగళవారం జరగనున్న మ్యాచ్‌కు ముందురోజే స్టేడియం పేరు మార్చేశారు. దీంతో అప్పటికే విమర్శకుల నోటికి పని చెప్పిన స్టేడియం మరో విధంగానూ వార్తల్లోకెక్కింది. ఇకానా స్టేడియంగా ఉన్న పేరును మార్చి అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరును పెట్టింది.

వెస్టిండీస్‌తో రెండో టీ20లో తప్పిన పెను ప్రమాదంవెస్టిండీస్‌తో రెండో టీ20లో తప్పిన పెను ప్రమాదం

 త్రివర్ణపతాకాలను తప్ప మరే జెండాలను

త్రివర్ణపతాకాలను తప్ప మరే జెండాలను

రెండో టీ20 మ్యాచ్‌ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు స్టేడియంలోకి త్రివర్ణపతాకాలను తప్ప మరే ఇతర పార్టీ జెండాలను అనుమతించలేదట. ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు కానీ, టోపీలను గానీ ఎలాంటివి ధరించి స్టేడియంలోకి అనుమతించలేదట. ఈ విషయంలో పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

 యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌

యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌

స్టేడియానికి వచ్చే వీక్షకుల భద్రతా విషయాల గురించి లక్నో సీనియర్‌ పోలీస్‌ సుపరిటెండెంట్‌ కళానిధి నైథనీ మాట్లాడారు. సోమవారం నాడు ఇకానా స్టేడియం పేరును భారత రత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంగా మారుస్తూ యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ స్టేడియం యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ హయాంలో నిర్మించడంతో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమాజ్‌వాదీ శ్రేణులు స్వగతించ లేదు.

ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం

ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం

'ఇంటెలిజెన్స్ వర్గాలు ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం అసంతృప్తితో ఎస్పీ పార్టీ కార్యకర్తలు ఏమైనా చేయొచ్చని అనుమానంతో జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ క్రమంలో సుమారు 1500మంది పార్టీ శ్రేణులు భాజపా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎరుపు టోపీలు, నలుపు జెండాలతో మ్యాచ్‌కు హాజరయ్యేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో మ్యాచ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఒక్క త్రివర్ణపతాకానికి సంబంధించిన జెండాలు తప్ప.. మరెలాంటి జెండాలు, టోపీలు, బ్యానర్లను స్టేడియంలోకి అనుమతించలేదు' అని ఆయన పేర్కొన్నారు.

 భద్రత దృష్ట్యా స్టేడియం వద్ద 3200 పోలీసులు

భద్రత దృష్ట్యా స్టేడియం వద్ద 3200 పోలీసులు

పూర్తిస్థాయి భద్రత దృష్ట్యా స్టేడియం వద్ద సుమారు 3200మంది పోలీసులను మోహరించినట్లు తెలిసింది. ఇంతకుముందు యూపీలో పలుమార్లు ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. లక్నో మెట్రో రైలు ప్రారంభోత్సవం నాడు, ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌, నోయిడాలో ఢిల్లీ మెట్రో విస్తరణ సమయంలోనూ ఇలాంటి ఆందోళనలే జరిగాయి. అలాంటివి చోటుచేసుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Story first published: Wednesday, November 7, 2018, 16:06 [IST]
Other articles published on Nov 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X