న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ ముంబై ఇండియన్స్‌కు పార్థివ్‌ పటేల్.. ఈసారి ఆటగాడిగా కాదు!!

Parthiv Patel joins Mumbai Indians coaching staff and Talent Scout

ముంబై: టీమిండియా వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ బుధవారం అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత 24 గంటల్లోపే కొత్త అవతారం ఎత్తాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రతిభాన్వేషకుడిగా చేరాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తోన్న యువ ఆటగాళ్లను గుర్తించడం కోసం ముంబై కోచింగ్ స్టాఫ్, స్కౌట్స్ గ్రూప్‌తో కలిసి పార్థివ్ పని చేయనున్నాడు. మొత్తానికి ముంబై కోసం ప్రతిభావంతులైన కొత్త కుర్రాళ్లను వెతికే పనిలో పడ్డాడు.

స్కౌట్స్ గ్రూప్‌లో:

స్కౌట్స్ గ్రూప్‌లో:

2015, 2017 సీజన్లలో ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో పార్థీవ్ పటేల్ సభ్యుడు. పార్థివ్ ముంబై తరఫున మూడేళ్లు ఆడాడు. ఓపెనర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్‌‌గా జట్టుకు సేవలందించాడు. సుదీర్ఘకాలం రంజీ క్రికెట్ ఆడిన పార్థీవ్‌కు దేశవాళీ క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్ల గురించి బాగా తెలుసు. ఆ ఉద్దేశంతోనే ముంబై స్కౌట్స్ గ్రూప్‌లో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో పార్థీవ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో భాగమైనప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. పార్థివ్ భారత జట్టు తరఫున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడాడు.

మేం ఏం చేయాలనుకుంటున్నామో పార్థివ్‌కు తెలుసు:

మేం ఏం చేయాలనుకుంటున్నామో పార్థివ్‌కు తెలుసు:

'దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్లో పార్థివ్ పటేల్‌‌కు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఐపీఎల్‌లో వేగంగా పెరుగుతున్న పోటీని అతడు అర్థం చేసుకోగలడు' అని ముంబై ఇండియన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. మళ్లీ తమ బృందంలో చేరినందుకు ఆ ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ అభినందనలు తెలియజేశారు. 'ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నప్పటి నుంచి మాకు పార్థివ్ తెలివితేటలు తెలుసు. అతడికున్న క్రికెట్‌ విజ్ఞానంతో మా ప్రతిభాన్వేషణ వ్యవస్థకు తోడ్పడగలడని విశ్వాసం ఉంది. మా ఆలోచనా విధానం పార్థివ్‌ అర్థం చేసుకుంటాడు. ముంబైలో మేం ఏం చేయాలనుకుంటున్నామో అతడికి తెలుసు' అని అంబానీ పేర్కొన్నారు.

 మరుపురాని గుర్తులు:

మరుపురాని గుర్తులు:

తనకు మరో అవకాశం ఇచ్చిన ముంబై యాజమాన్యానికి పార్థివ్‌ పటేల్ కృతజ్ఞతలు తెలిపాడు. ‘ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ నా క్రికెట్‌ను ఎంతో ఆస్వాదించా. మూడు సార్లు ట్రోఫీలు అందుకోవడం నాకు మరుపురాని గుర్తులు. ఇప్పుడు నా జీవితంలో సరికొత్త అధ్యాయానికి సమయం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ముంబైకి ధన్యవాదాలు' అని అన్నాడు. 2002లో ట్రెంట్ బ్రిడ్జి వేదికగా ఇంగ్లడ్‌తో మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి పార్థీవ్ అడుగుపెట్టాడు. 17 ఏళ్ల 153 రోజుల వయసులో క్రికెట్లోకి అడుగుపెట్టి.. అత్యంత పిన్న వయస్కుడైన వికెట్ కీపర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.

రోహిత్‌ శర్మకు ఆగ్ని పరీక్ష.. పరీక్షలో పాసవుతాడా?

Story first published: Friday, December 11, 2020, 10:12 [IST]
Other articles published on Dec 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X