రియాన్‌ పరాగ్‌కు గొప్ప భవిష్యత్‌ ఉంది: స్టీవ్‌ స్మిత్‌

IPL 2019 : Steve Smith Says Riyan Parag Has A Great Future || Oneindia Telugu

రాజస్థాన్‌ రాయల్స్‌ యువ ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌కు గొప్ప భవిష్యత్‌ ఉంది అని ఆ జట్టు కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ పేర్కొన్నాడు. శనివారం జైపూర్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 5 వికెట్ల తేడాతో గెలిచింది. మొదటగా బంతితో.. ఆతర్వాత బ్యాట్ తో మెరిశాడు పరాగ్‌. 2 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి ఫరవాలేదనిపించాడు. అనంతరం 46 (29 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్‌) పరుగులు చేశాడు.

గొప్ప భవిష్యత్‌ ఉంది:

గొప్ప భవిష్యత్‌ ఉంది:

మ్యాచ్ అనంతరం కెప్టెన్ స్మిత్ మాట్లాడుతూ... 'పరాగ్‌ బాగా ఆకట్టుకున్నాడు. నెట్స్‌లో అతను బ్యాటింగ్ చూస్తున్నాను. తీవ్రంగా సాధన చేస్తున్నాడు. అతనికి గొప్ప భవిష్యత్‌ ఉంది. నేను పదిహేడేళ్ల వయసులో ఎలా నమ్మకంగా ఉన్నానో పరాగ్‌ అలాగే కనిపిస్తున్నాడు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా బ్యాటింగ్ చేసాడు' అని స్మిత్‌ ప్రశంసించాడు.

విజయాలను కొనసాగిస్తాం:

విజయాలను కొనసాగిస్తాం:

'ఈ టోర్నమెంట్లో ఎక్కువగా పరుగులు చేయలేదు. అయితే ఈ రోజు పరుగులు చేసినందుకు ఆనందంగా ఉంది. ప్రధాన ఆటగాళ్లు అందరూ గాడిన పడ్డారు. ఇక్కడి నుండి విజయాలను కొనసాగిస్తాం. 160 పెరుగుల లక్ష్యం సాధించడం చాలా గొప్ప విషయం. జోఫ్రా అద్భుతంగా బౌలింగ్ చేసాడు. మా ప్రణాళికలు సఫలం అయ్యాయి. వచ్చే మ్యాచ్‌లలో కూడా విజయాలు సాధిస్తాం' అని స్మిత్‌ ఆశాభావం వ్యక్తం చేసాడు.

ప్లే ఆఫ్‌ ఆశలు సజీవం:

ప్లే ఆఫ్‌ ఆశలు సజీవం:

ప్లే ఆఫ్‌ ఆశలు నిలబెట్టుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ సమష్టిగా రాణించి విజయం సాధించింది. సొంతగడ్డపై శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసింది. క్వింటన్‌ డికాక్‌ (47 బంతుల్లో 65; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేసాడు. అనంతరం రాజస్తాన్‌ రాయల్స్‌ 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసి గెలుపొందింది. స్మిత్‌ (48 బంతుల్లో 59 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రియాన్‌ పరాగ్‌లు విజయంలో కీలక పాత్ర పోషించారు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, April 21, 2019, 17:15 [IST]
Other articles published on Apr 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X