న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు బేషరతు క్షమాపణ చెప్పారు కానీ

Hardik Pandya, Rahul Tender Unconditional apology,BCCI Officials Demand An SGM | Oneindia Telugu
Pandya, Rahul tender unconditional apology; Rai seeks to correct players, not end their careers

హైదరాబాద్: 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి నిషేధం ఎదుర్కొంటున్న భారత క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. మహిళలపై వారిద్దరూ చేసిన వ్యాఖ్యలతో దుమారం చెలరేగడంతో పాండ్యా, రాహుల్‌కు బీసీసీఐ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.

<strong>సందేహం లేదు, ధోని జట్టులో సభ్యుడే: కోహ్లీ ప్రశంస</strong>సందేహం లేదు, ధోని జట్టులో సభ్యుడే: కోహ్లీ ప్రశంస

తమకు కొత్తగా జారీ చేసిన రెండో షోకాజ్‌ నోటీసులకు బదులిస్తూ తమను మన్నించాలని వీరిద్దరు విజ్ఞప్తి చేశారు. బేషరతు క్షమాపణ చెప్పినా... వారి కష్టాలు ఇంకా తొలగిపోలేదు. సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ ఆదేశాలను అనుసరించి బోర్డు నిబంధన 41 (సి) ప్రకారం వీరిద్దరిపై సీఈఓ రాహుల్‌ జోహ్రీ విచారణ కొనసాగించనున్నారు.

జోహ్రీతోనే విచారణ జరిపించడంపై

జోహ్రీతోనే విచారణ జరిపించడంపై

అయితే, ఇటీవలే యువతులను వేధించిన ఆరోపణలు ఎదుర్కొన్న బీసీసీఐ సీఈఓ జోహ్రీతోనే విచారణ జరిపించడంపై సీఓఏ మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారిద్దరిపై విచారణ కోసం సీఓఏ, బీసీసీఐ ఆఫీసు బేరర్లే విచారణ నిర్వహించాలని ఆమె డిమాండ్‌ చేశారు. దీనిపై వినోద్‌ రాయ్‌ వివరణ ఇస్తూ ఆమెకు లేఖ రాశారు.

బోర్డు నియమావళి ప్రకారమే

బోర్డు నియమావళి ప్రకారమే

త్వరగా విచారణ పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే అని వినోద్ రాయ్ స్పష్టం చేశారు. "పాండ్యా, రాహుల్‌ను సరిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉంది. వారి కెరీర్‌ను నాశనం చేయాలనుకోవడం లేదు. బోర్డు నియమావళి ప్రకారమే సీఈఓ విచారణ చేస్తున్నారు తప్ప అది కంటితుడుపు కాదు" అని వినోద్ రాయ్‌ స్పష్టం చేశారు.

నిబంధన 41 (సి) కింద

నిబంధన 41 (సి) కింద

బీసీసీఐ కొత్త రాజ్యాంగంలోని నిబంధన 41 (సి) కింద ఆటగాళ్లపై విచారణ జరపాలని రాయ్‌ ఈ మేరకు బీసీసీఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జోహ్రిని ఆదేశించాడని ఓ బోర్డు అధికారి చెప్పాడు. పాండ్యా, రాహుల్‌లను బీసీసీఐ ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటన నుంచి స్వదేశానికి పిలిపించిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, January 16, 2019, 10:58 [IST]
Other articles published on Jan 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X