న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి ఆసియా వికెట్‌ కీపర్‌గా కమ్రాన్‌ అక్మల్‌ అరుదైన రికార్డు!!

Pakistan wicket keeper Kamran Akmal achieves unprecedented milestone in first-class cricket

హైదరాబాద్: పాకిస్తాన్‌ వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్ కమ్రాన్‌ అక్మల్‌ అరుదైన రికార్డు సాధించాడు. కమ్రాన్‌ అక్మల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అద్భుత ఆటతో పరుగులు చేస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో భాగంగా సెంట్రల్‌ పంజాబ్‌ జట్టుకు అక్మల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఉత్తర పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్మల్‌ సెంచరీ 157 (170 బంతుల్లో; 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) చేసాడు. దాంతో తన ఫస్ట్‌ క్లాస్ కెరీర్‌లో 31వ సెంచరీ నమోదు చేశాడు.

చహల్‌కు రితిక షాకింగ్ రిప్లై.. అందుకే నిన్ను కట్‌ చేశా!!చహల్‌కు రితిక షాకింగ్ రిప్లై.. అందుకే నిన్ను కట్‌ చేశా!!

ఫలితంగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 31వ సెంచరీ చేసిన తొలి ఆసియా వికెట్‌ కీపర్‌గా అక్మల్‌ రికార్డు సాధించాడు. ఇక ప్రపంచ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్‌ (29) కంటే ఎక్కువ ఫస్ట్‌క్లాస్‌ సెంచరీలు చేసిన ఘనతను అక్మల్‌ నమోదు చేశాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ మాజీ వికెట్‌ కీపర్‌ లెస్‌ ఏమ్స్‌ (56) అగ్రస్థానంలో ఉన్నాడు. జిమ్ పార్క్స్ (27) నాలుగో స్థానంలో.. కౌషల్ సిల్వా & క్రిస్ గేల్ 26 సెంచరీలతో సంయుక్తంగా ఐదవ స్థానంలో ఉన్నారు.

సెంట్రల్ పంజాబ్ వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్న సమయంలో కమ్రాన్, అజార్ సెంచరీకి పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. అక్మల్‌ సెంచరీ, అజార్ 110 పరుగులు చేయడంతో సెంట్రల్‌ పంజాబ్‌ 5 వికెట్లకు 369 పరుగులతో గౌరవప్రధానమైన స్కోర్‌ చేయగలిగింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఫామ్‌లేమి కారణంగా సెలక్టర్లు కమ్రాన్‌ అక్మల్‌కు మొండిచేయి చూపగా.. దేశవాళీ క్రికెట్‌లో రాణించడం విశేషం. అక్మల్‌ చివరిసారిగా 2010లో ఇంగ్లండ్‌తో టెస్టు ఆడగా.. వన్డేల్లో 2017లో వెస్ట్ండీస్‌తో చివరి వన్డే ఆడాడు. అప్పటి నుండి అక్మల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌, పాకిస్థాన్ సూపర్ లీగుల్లో ఆడుతున్నాడు.

Story first published: Monday, September 23, 2019, 8:07 [IST]
Other articles published on Sep 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X