న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్‌ క్రికెటర్‌ సంచలనం.. 10 ఏళ్ల తర్వాత టెస్టుల్లోకి ఎంపిక!!

Pakistan vs Sri Lanka: Pakistan recalls batsman Fawad Alam after 10 years


ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ సీనియర్ క్రికెటర్‌ ఫవాద్‌ ఆలమ్‌ సంచలనం సృష్టించాడు. 10 ఏళ్ల తర్వాత ఆలమ్‌ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. పాక్ సెలెక్టర్లు శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో ఫవాద్‌కు జట్టులో చోటిచ్చారు. దేశవాళీ క్రికెట్లో నిలగడ ప్రదర్శిస్తూ భారీ పరుగులు సాధించడంతో అతడిని ఎంపిక చేశామని పాక్‌ చీఫ్‌ సెలక్టర్‌, హెడ్ కోచ్‌ మిస్బావుల్‌ హఖ్‌ తెలిపాడు.

కేరళ అభిమానుల ఆందోళన.. రెండో టీ20లో శాంసన్‌కు చోటివ్వరా!!కేరళ అభిమానుల ఆందోళన.. రెండో టీ20లో శాంసన్‌కు చోటివ్వరా!!

 10 ఏళ్ల తర్వాత టెస్టుల్లోకి:

10 ఏళ్ల తర్వాత టెస్టుల్లోకి:

ఫవాద్‌ ఆలమ్‌ చివరిసారి 2009లో డ్యునెడిన్‌లో న్యూజిలాండ్‌పై ఆడాడు. 2009, జులైలో ఆలమ్‌ శ్రీలంకపై అరంగేట్రం చేసి సెంచరీ చేసాడు. 16 ఏళ్ల తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 56.84 సగటుతో 12,222 పరుగులు సాధించడం విశేషం. ఇక ఆస్ట్రేలియాకు ఎంపిక చేసిన జట్టులో పాక్‌ సెలక్టర్లు రెండు మార్పులు చేశారు. ఇఫ్తికార్‌ అహ్మద్‌ స్థానంలో ఆలమ్‌, యువ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ మూసా స్థానంలో ఉస్మాన్‌ షిన్వారీని జట్టులోకి తీసుకున్నారు.

జట్టుతోనే మూసా:

జట్టుతోనే మూసా:

పాక్ జట్టులో మూసాను ఎంపిక చేయనప్పటికీ.. అతడు టెస్టు జట్టుతో ఉంటాడని మిస్బా అన్నాడ. పాక్ బౌలింగ్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌ వద్ద మూసా శిక్షణ తీసుకుంటాడట. 'ప్రస్తుతం నేను వన్ మ్యాన్ షో (సెలెక్టర్, కోచ్, బ్యాటింగ్ కోచ్) చేస్తున్నా. దేశీయ క్రికెట్‌లో ఆటగాళ్లను నిశితంగా చూసే ఆరుగురు సెలెక్టర్లు ఉన్నారు. ఆటగాళ్ల టెక్నిక్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఆటగాళ్ల బలాబలాలు అందరికి తెలుసు. ఎన్ని బాధ్యతలు ఉన్నా.. నా ప్రధాన బాధ్యత మాత్రం కోచ్' అని పేర్కొన్నాడు.

రావల్పిండిలో తొలి టెస్టు:

రావల్పిండిలో తొలి టెస్టు:

బుధవారం రావల్పిండిలో పాకిస్థాన్‌-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభమవుతుంది. రెండో మ్యాచ్‌కు కరాచీ వేదిక. శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై 2009 ఉగ్రదాడి జరగడంతో పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ నిలిచిపోయింది. అయితే అదే శ్రీలంక జట్టు ఇటీవలే పాక్ గడ్డపై వన్డే, టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే.

Squad

Squad

Azhar Ali (captain), Abid Ali, Asad Shafiq, Babar Azam, Fawad Alam, Haris Sohail, Imam-ul-Haq, Imran Khan, Kashif Bhatti, Mohammad Abbas, Mohammad Rizwan (wk), Naseem Shah, Shaheen Afridi, Shan Masood, Yasir Shah, Usman Shinwari.

Story first published: Sunday, December 8, 2019, 13:50 [IST]
Other articles published on Dec 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X