న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక గేమ్‌ రెండో రోజుల పాటు వర్షార్పణం: పాక్-లంక మ్యాచ్‌పై ఐసీసీ వినూత్న ట్వీట్

Pakistan vs Sri Lanka: ICC Posts Hilarious Tweet As Rain Washes Out A Game Two Days Away

హైదరాబాద్: పదేళ్ల తర్వాత సొంత అభిమానుల మధ్య అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలనుకున్న పాక్‌ ఆటగాళ్ల ఆశలకు వరుణుడు అడ్డుపడ్డాడు. పాకిస్తాన్‌-శ్రీలంక జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా కరాచీ వేదికగా జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. శుక్రవారం జరగాల్సిన తొలి వన్డే కనీసం టాస్‌ కూడా పడకుండానే రద్దైంది.

అయితే, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరగాల్సిన రెండో వన్డేకు కూడా వరుణుడి ముప్పు ఉండటంతో పాక్‌ క్రికెట్‌ బోర్డు మ్యాచ్‌ను ఆ మరుసటి రోజుకు వాయిదా వేసింది. దీంతో ఆదివారం జరగాల్సిన రెండో వన్డే సోమవారం జరగనుంది. ఈ మేరకు బోర్డు అధికారిక ప్రకటన చేసింది.

గంగూలీ, అజహర్ అరుదైన ఘనత: ఆడిన అసోసియేషన్లకే అధ్యక్షులుగా!గంగూలీ, అజహర్ అరుదైన ఘనత: ఆడిన అసోసియేషన్లకే అధ్యక్షులుగా!

"శుక్రవారం మధ్యాహ్నం ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. ఈ వారం అధిక వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మైదాన సిబ్బంది పిచ్‌ను తయారు చేయడానికి రెండో రోజల సమయం పడుతుందని అన్నారు. వన్డే సిరీస్‌ షెడ్యూల్‌ను మార్చాం. సెప్టెంబర్‌ 29 జరగాల్సిన రెండో వన్డేను ఆ తర్వాతి రోజున నిర్వహిస్తాం. తొలి వన్డేకు టికెట్లు తీసుకున్న ప్రేక్షకులు రెండో వన్డేకు రావొచ్చు" అని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.

ఒకే వేదికలో జరగాల్సిన రెండు వన్డేల్లో ఒకటి వర్షం కారణంగా రద్దు కాగా... మరొకటి వాయిదా పడడటంతో ఐసీసీ తన ట్విట్టర్‌లో ప్రత్యేకంగా ట్వీట్ చేసింది. ఐసీసీ తన ట్విట్టర్‌లో "భారీ వర్షం కారణంగా ఒకే వేదికలో జరగాల్సిన ఒక గేమ్‌ రెండో రోజుల పాటు వర్షార్పణం అవుతుందని ఎప్పుడైనా విన్నారా? అంటూ ట్వీట్ చేసింది.

ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు సిరిస్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. మూడు వన్డేలూ కరాచీ వేదికగా జరగాల్సి ఉంది. శుక్రవారం తొలి వన్డే, ఆదివారం రెండో వన్డే జరగాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు కురుస్తుండటంతో పీసీబీ మ్యాచ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసింది.

పాకిస్థాన్‌లో శ్రీలంక పర్యటన టూర్ షెడ్యూల్:
వన్డేలు
1st ODI at National Stadium, Karachi: September 27 at 15:30 IST
2nd ODI at National Stadium, Karachi: September 29 at 15:30 IST
3rd ODI at National Stadium, Karachi: October 03 at 15:30 IST

టీ20లు
1st T20I at Gaddafi Stadium, Lahore: October 05 at 19:00 IST
2nd T20I at Gaddafi Stadium, Lahore: October 07 at 19:00 IST
3rd T20I at Gaddafi Stadium, Lahore: October 09 at 19:00 IST

Story first published: Saturday, September 28, 2019, 14:38 [IST]
Other articles published on Sep 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X