న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భారత్‌ చేతిలో ఓటమి అనంతరం ఆత్మహత్య చేసుకుందామనుకున్నా'

ICC Cricket World Cup 2019 : Pak Coach Mickey Arthur Emotional Statement After Loss Against India
Pakistan vs South Africa: Pakistan Coach Mickey Arthur Claims Defeat to India Left Him Wanting To Commit Suicide

భారత్‌తో మ్యాచ్‌లో ఘోర పరాజయం అనంతరం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని పాకిస్థాన్‌ కోచ్‌ మికీ ఆర్థర్‌ (51) తెలిపారు. ప్రపంచకప్‌లో భాగంగా ఈనెల 16న జరిగిన మ్యాచ్‌లో భారత్‌ చేతిలో పాకిస్థాన్‌ 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. భారత్‌పై పరాజయం తర్వాత పాకిస్తాన్‌ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మరోవైపు కోచ్ ఆర్థర్‌పై కూడా ఆ దేశ అభిమానులు విరుచుకుపడ్డారు. ఆ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించిన నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా:

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా:

అయితే ఆదివారం (జూన్ 23) దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 49 పరుగుల తేడాతో గెలుపొందింది. తాజాగా మికీ ఆర్థర్‌ మాట్లాడుతూ... 'గత ఆదివారం భారత్‌తో మ్యాచ్‌ అనంతరం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. చూస్తుండగానే మ్యాచ్‌ను కోల్పోయాం. ఒక్క చెత్త ప్రదర్శన కారణంగా ఆ ఆలోచన కలిగింది. ఇది ప్రపంచకప్‌ అందరూ ఇటువైపే చూస్తారు. ఒక్క మంచి ప్రదర్శన చేస్తే అన్నీ సర్దుకుంటాయని ఆలోచించా. సరిగ్గా వారం తర్వాత సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో ఆడారు. ఈ విజయం మాపై ఒత్తిడి తగ్గించింది' అని ఆర్థర్‌ చెప్పుకొచ్చారు.

సోషల్‌ మీడియాలో దుమారం:

సోషల్‌ మీడియాలో దుమారం:

ఆర్థర్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ప్రొఫెషనల్‌ కోచ్‌ అయి ఉండి కేవలం ఒక్క ఓటమికి ఇటువంటి చెత్త ఆలోచనలు చేస్తున్నాడా?. అసలు ఆర్థర్‌ కోచ్‌గా అనర్హుడు అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓటమి తర్వాత ఆటగాళ్లలో స్థైర్యం నింపాల్సిన కోచ్.. ఇటువంటి ఆలోచనలు చేస్తే డ్రెస్సింగ్‌రూమ్‌ వాతావరణం ఎలా ఉంటుందో అతనికి తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. 2007 ప్రపంచకప్‌ సమయంలో పాకిస్థాన్‌ చీఫ్‌ కోచ్‌ బాబ్‌ ఊల్మర్‌ అకాల మరణం చెందారు. అప్పుడు పాకిస్థాన్‌ గ్రూప్‌ దశ నుంచి నిష్క్రమించింది.

కొంతమంది నోర్లనైనా మూయించామనుకుంటున్నా:

కొంతమంది నోర్లనైనా మూయించామనుకుంటున్నా:

ఆదివారం మ్యాచ్‌ అనంతరం ఆర్థర్‌ మాట్లాడుతూ... 'నాకు ఏదైతే తెలుసో అదే మా ఆటగాళ్లు చేస్తారు. పాక్ ఆటగాళ్లు తిరిగి గాడిలో పడడంతో మ్యాచ్ గెలిచాం. టీమిండియాతో ఓటమి కారుణంగా అనేక విమర్శలు వచ్చాయి. మీడియా, సోషల్‌ మీడియాతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ విజయంతో వారిలో కొంతమంది నోర్లనైనా మూయించామనుకుంటున్నా' అని ఆర్థర్‌ అన్నారు.

సెమీస్‌ చేరుతాం:

సెమీస్‌ చేరుతాం:

'న్యూజిలాండ్‌తో మ్యాచ్ కూడా గెలుస్తాం. సెమీస్‌ చేరేందుకు మిగతా మ్యాచ్‌లని సైతం గెలుస్తాం. న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లను ఓడించి సెమీస్‌ చేరుతాం. పాక్ జట్టు బలంగా ఉంది. పాకిస్థాన్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ బాగానే ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో క్యాచ్‌లు జారవిడవడంపై దృష్టిసారిస్తాం. తదుపరి మ్యాచ్‌ల్లో పొరపాట్లు చేయకుండా చూసుకుంటాం. హారిస్‌ సోహైల్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అతని బ్యాటింగ్‌ అద్భుతం' అని ఆర్థర్‌ తెలిపారు.

Story first published: Tuesday, June 25, 2019, 9:18 [IST]
Other articles published on Jun 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X