న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Pakistan vs South Africa: అజహర్ అలీ భాయ్.. ఆ పిల్లికి కరోనా టెస్టు చేయలేదు! రిజ్వాన్ వార్నింగ్!

Pakistan vs South Africa: Mohammad Rizwan trolls Azhar Ali as he chases a cat on field

రావల్పిండి: దక్షిణాఫ్రికా జట్టు పాకిస్తాన్‌ పర్యటనలో ఉన్న తెలిసిందే. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇరు జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆదివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 370 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తుండగా.. ఎవరూ ఊహించని విధంగా మైదానం‌లోకి ఓ నల్ల పిల్లి వచ్చింది. దాంతో అంపైర్లు మ్యాచ్‌ని కాసేపు నిలిపివేశారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మాజీ కెప్టెన్ అజహర్ అలీ.. ఆ పిల్లి వెంబడించి బౌండరీ లైన్ వెలుపలికి తరిమేశాడు. అదే సమయంలో అలీ‌కి వికెట్‌ కీపర్‌ మహ్మద్ రిజ్వాన్ ఓ స్వీట్ వార్నింగ్ ఇస్తూ కనిపించాడు.

పిల్లికి కరోనా టెస్టు చేయలేదు

పిల్లిని బౌండరీ లైన్ వెలుపలికి తరిమేసిన అజహర్ అలీని మహ్మద్ రిజ్వాన్ సరదాగా టీజ్ చేశాడు. 'అజ్జూ బాయ్‌.. మనం బయోబబూల్‌లో ఉన్నాం. అది (పిల్లి) లేదు. ముందు దానికి కరోనా టెస్టు నిర్వహించి ఆ తర్వాత బయటికి పంపు' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. రిజ్వాన్‌ వ్యాఖ్యలు విన్న పాక్‌ ఆటగాళ్లు నవ్వును ఆపుకోలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఇస్మాయిల్‌ ఫారుక్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ నెట్టింట వైరల్ అయింది. 'అజహర్ అలీకి కరోనా టెస్ట్ చేయాలి', 'అజహర్ అలీ బబుల్ రూల్స్ బ్రేక్ చేశాడు' అని కామెంట్లు పెట్టారు.

బయో బబుల్ వాతావరణంలో

బయో బబుల్ వాతావరణంలో

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ని బయో-సెక్యూర్ బబుల్ వాతావరణంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్వహిస్తోంది. ఆటగాళ్లని తొలుత క్వారంటైన్‌లో ఉంచి ఆ తర్వాత కరోనా వైరస్ పరీక్షల అనంతరమే వారిని బబుల్‌లోకి అనుమతించింది. సిరీస్ ముగిసే వరకూ బబుల్‌ వెలుపలి వ్యక్తులు ఆటగాళ్లను కలవడానికి వీల్లేదు. అలానే బబుల్‌లోని వారు బయటకు వెళ్లడానికి వీల్లేదు.

ఇంకా 126 పరుగులు

ఇంకా 126 పరుగులు

గురువారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులు చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 201 పరుగులకే ఆలౌట్ అయింది. 71 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అందుకున్న పాకిస్థాన్.. రెండో ఇన్నింగ్స్‌‌లో 298 పరుగులకి ఆలౌటైంది. పాక్ మొత్తంగా 370 పరుగుల లక్యంను దక్షిణాఫ్రికా ముందు నిలిచింది. దక్షిణాఫ్రికా ప్రస్తుతం విజయం దిశగా దూసుకెళుతోంది. 5 వికెట్ల నష్టానికి 244 రన్స్ చేసింది. విజయానికి ఇంకా 126 పరుగులు చేయాలి. ఇంకో సెషన్ ఆట ఉంది.

India vs England: 33 ఏళ్లలో ఇదే తొలిసారి.. టెస్ట్ క్రికెట్‌లో అశ్విన్‌ అరుదైన ఘనత!!

Story first published: Monday, February 8, 2021, 14:25 [IST]
Other articles published on Feb 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X