న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చివరి వరకు ఉత్కంఠ: తొలి టెస్ట్‌‌లో 4 పరుగుల తేడాతో పాక్‌ ఓటమి

Pakistan vs New Zealand, Ist Test: Kiwis beat Pak by four runs; Ajaz Patel takes five

హైదరాబాద్: అబుదాబి వేదికగా కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో గెలుపు తమదేనని భావించిన ఆతిథ్య పాకిస్థాన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ టెస్టులో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్‌ ముంగిట బోల్తా పడింది.

ఐపీఎల్ 2019: వేలంలో అత్యధిక ధర పలికే ఆ నలుగురు వీరేఐపీఎల్ 2019: వేలంలో అత్యధిక ధర పలికే ఆ నలుగురు వీరే

ఈ మ్యాచ్‌లో పాక్ కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈరోజు తొలి సెషన్‌లో కేవలం 8 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు చేజార్చుకున్న పాకిస్థాన్.. ఆ తర్వాత 41 పరుగుల వ్యవధిలో ఏకంగా ఆరు వికెట్లను కోల్పోయింది. దీంతో ఒకానొక దశలో 130/4తో ఉన్న ఆ జట్టు 171కే ఆలౌటైంది.

శనివారం నుంచి రెండో టెస్టు

శనివారం నుంచి రెండో టెస్టు

దీంతో శుక్రవారం ఆరంభమైన ఈ మ్యాచ్‌ నాలుగు రోజుల్లోనే ముగియగా రెండో టెస్టు మ్యాచ్ శనివారం నుంచి జరగనుంది. సోమవారం నాలుగో రోజు ఆటలో భాగంగా పాకిస్తాన్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 171 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ ఆటగాళ్లలో అజహర్‌ అలీ(75) చివరి వరకు విజయం కోసం పోరాడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అజహర్ అలీ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ శిబిరంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది.

పాక్‌కు షాకిచ్చిన న్యూజిలాండ్ బౌలర్ అజాజ్‌ పటేల్‌

పాక్‌కు షాకిచ్చిన న్యూజిలాండ్ బౌలర్ అజాజ్‌ పటేల్‌

అంతకముందు తొలి టెస్టులో విజయం తమదేనన్న ధీమాగా ఉన్న పాక్‌కు న్యూజిలాండ్ బౌలర్ అజాజ్‌ పటేల్‌ షాకిచ్చాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్‌ ఐదు వికెట్లతో రాణించగా, ఇష్ సోథీ, వాగ్నర్‌లు తలో రెండు వికెట్లు తీశారు. స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పాకిస్థాన్ 40 పరుగుల వద్ద ఇమాముల్‌ హక్‌(27) రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత నాలుగు పరుగుల వ్యవధిలో మహ్మద్‌ హఫీజ్‌(10) కూడా ఔటయ్యాడు.

ఒంటిరిగా పోరాడిన అజహర్ అలీ

ఒంటిరిగా పోరాడిన అజహర్ అలీ

ఆ తర్వాత హారిస్‌ సోహైల్‌(4) మూడో వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో పాక్ 48 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అసాద్‌ షఫీక్‌ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. అయితే షఫీక్‌ ఔటైన తర్వాత మళ్లీ వరుసగా పాకిస్థాన్ వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో అజహర్‌ అలీ ఒంటిరిగా పోరాడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు.

వికెట్లు ముందు దొరికిపోయిన అలీ

వికెట్లు ముందు దొరికిపోయిన అలీ

ఒక ఎండ్‌లో వికెట్లు పడుతుండటంతో సాధ్యమైనంతవరకు తానే ఎక్కువగా బ్యాటింగ్‌ చేశాడు. చివర్లో అజాజ్‌ పటేల్‌ వేసిన ఓ డెలివరీకి వికెట్లు ముందు దొరికిపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే అలాటైంది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (63) హాప్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాకిస్థాన్ జట్టు బాబర్ అజామ్ (63) హాఫ్ సెంచరీ సాధించడంతో 227 పరుగులకి ఆలౌటైంది.

 తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల ఆధిక్యం

తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల ఆధిక్యం

దీంతో 74 పరుగుల ఆధిక్యం పాక్‌‌కి లభించింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ ఫరవాలేదనిపించారు. ఓపెనర్ జీత్ రావల్ (46), హెన్నీ నికోలస్ (55), బీజే వాట్లింగ్ (59) హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో న్యూజిలాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌‌లో 249 పరుగులు చేసింది. పాక్‌కు 176 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

స్కోరు కార్డు వివరాలు:

స్కోరు కార్డు వివరాలు:

పాక్ తొలి ఇన్నింగ్స్‌ 227 ఆలౌట్‌

రెండో ఇన్నింగ్స్‌ 171 ఆలౌట్‌

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 153 ఆలౌట్‌

రెండో ఇన‍్నింగ్స్‌ 249 ఆలౌట్‌

Story first published: Monday, November 19, 2018, 17:46 [IST]
Other articles published on Nov 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X