న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పాక్ స్పిన్నర్

Pak Spinner Retires From International Cricket
Pakistan spinner Abdur Rehman retires from international cricket

హైదరాబాద్: పాకిస్థాన్ సీనియర్ స్పిన్నర్ అబ్దూర్ రెహ్మాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే దేశవాళీ క్రికెట్లో కొనసాగుతానని చెప్పాడు. 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్.. 2012లో యూఏఈ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు.

తద్వారా పాక్‌ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత కూడా మెరుగ్గానే రాణించినా.. 2014 తర్వాత పాక్ సెలక్టర్ల‌ని మెప్పించలేకపోయాడు. పాక్ తరుపున 2006 నుంచి 2014 వరకు 31 వన్డేలు, 22 టెస్టులతో పాటు 8 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడిన రెహ్మాన్ మొత్తం 140 వికెట్లు పడగొట్టాడు.

ఈ సందర్భంగా అబ్దూర్ మాట్లాడుతూ "బరువెక్కిన గుండెతోనే అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలుకుతున్నా. ఇది చాలా కఠినమైన నిర్ణయమని నాకు తెలుసు. కానీ.. తప్పట్లేదు. అయితే.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతా. నా కెరీర్‌లో మరిచిపోలేని విజయం.. ఇంగ్లాండ్‌ను క్వీన్‌స్వీప్ చేయడమే" అని రెహ్మాన్ వెల్లడించాడు.

Story first published: Thursday, October 11, 2018, 9:21 [IST]
Other articles published on Oct 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X