న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అంతటి స్కోరు చేస్తేనే టీమిండియా గెలవగలదు'

Pakistan Should Play At Least Two Frontline Spinners Against India: Saeed Ajmal

న్యూఢిల్లీ: ఆసియా కప్‌లో భారత జట్టుని పాకిస్థాన్ ఓడించాలంటే కనీసం 250+ స్కోరు చేయాలని పాక్ మాజీ ఆఫ్ స్పిన్నర్ అజ్మల్ సూచించాడు. టోర్నీ గ్రూప్ దశలో ఇప్పటికే భారత్ చేతిలో ఓసారి ఓడిన పాకిస్థాన్ టీమ్.. ఈరోజు మళ్లీ సూపర్-4లో భాగంగా ఢీకొననుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అజ్మల్.. పాక్ తుది జట్టు ఎంపికపై కూడా పెదవి విరిచాడు.

పాక్ జట్టులో షోయబ్ మాలిక్ మినహా

పాక్ జట్టులో షోయబ్ మాలిక్ మినహా

సీనియర్, జూనియర్ల కలయికతో భారత్ జట్టు మంచి సమతూకంతో కనిపిస్తుండగా.. పాక్ జట్టులో షోయబ్ మాలిక్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ సీనియర్లు లేరని.. అంతేకాకుండా మ్యాచ్‌కి అనుగుణంగా జట్టులో మార్పులు చేయడంలోనూ మేనేజ్‌మెంట్ విఫలమైందని విమర్శించాడు.

 తెలివిగా భారత్ రవీంద్ర జడేజాని

తెలివిగా భారత్ రవీంద్ర జడేజాని

‘ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడగానే.. అతని స్థానంతో భారత్ తెలివిగా రవీంద్ర జడేజాని తీసుకుంది. బంగ్లాదేశ్‌పై అతను 4 వికెట్లతో మ్యాచ్‌ని గెలిపించే ప్రదర్శన చేశాడు. కానీ.. పాక్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిలైంది. కొన్నేళ్లుగా యూఏఈ పిచ్‌లపై పాకిస్థాన్ వరుసగా మ్యాచ్‌లు ఆడుతూనే ఉంది. కానీ.. ఇప్పుడు ఆసియా కప్ అక్కడే జరుగుతున్నా.. పేలవ ప్రదర్శన చేస్తోంది.

 వరుస విజయాలతో భారత్

వరుస విజయాలతో భారత్

మరోవైపు భారత్ మాత్రం ఛాంపియన్ తరహాలో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సూపర్-4లో భారత్‌ని ఓడించాలంటే పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ రాణించాలి. కనీసం 250+ స్కోరు చేయగలిగినప్పుడే పాకిస్థాన్ బౌలర్లు స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలరు. లేకుంటే మ్యాచ్‌లో పాక్‌ నిలవడం కష్టం. భారత్ తరహాలోనే పాక్ కూడా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలి' అని అజ్మల్ సూచించాడు.

 టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్

టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్

దుబాయ్ వేదికగా గత బుధవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 43.1 ఓవర్లలో 162 పరుగులకి ఆలౌటవగా.. లక్ష్యాన్ని టీమిండియా కేవలం 29 ఓవర్లలోనే 164/2తో ఛేదించేసింది. ఇప్పటికే టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియా మార్పుల్లేకుండా బరిలోకి దిగింది.

Story first published: Sunday, September 23, 2018, 17:36 [IST]
Other articles published on Sep 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X