న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్: కోహ్లీసేనపై ప్రతీకార సంబరాలు ప్లాన్ చేసిన పాకిస్థాన్

ICC Cricket World Cup 2019 : Pak Players Wanted Retaliatory Celebration Against India, PCB Says No
Pakistan players wanted retaliatory celebration against India, PCB says no

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో జూన్ 16న మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు ప్రతీకార సంబరాలు జరుపుకోవాలని భావిస్తుండగా అలాంటివేమీ చేయొద్దని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబి) చెప్పినట్లు పాకిస్థాన్ జర్నలిస్ట్ సజ్ సాధిక్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ ఏడాది జనవరిలో జమ్మూలో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో భారత్‌కు చెందిన 40కి పైగా జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడికి నివాళిగా రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోనీతో పాటు టీమిండియా ఆటగాళ్లందరూ భారత ఆర్మీ క్యాపులను ధరించి మ్యాచ్‌ ఆడారు.

ప్రతీకారంగా వరల్డ్‌కప్‌లో

అయితే, దీనికి ప్రతీకారంగా వరల్డ్‌కప్‌లో జూన్‌ 16న మాంచెస్టర్‌ వేదికగా భారత్‌తో జరిగే మ్యాచ్‌లో సంబరాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన పాకిస్థాన్‌ క్రికెట్‌బోర్డు సర్ఫ్‌రాజ్‌ అహ్మద్ నాయకత్వంలోని పాక్ జట్టుకు చెప్పినట్లు సజ్‌ సాదిక్‌ అనే జర్నలిస్ట్ ట్వీట్‌ చేశారు.

పీసీబీ ఛైర్మన్ ఇషాన్ మనీ ఇలా

సజ్ సాధిక్ 'పాక్ పాషన్' అనే వెబ్‌సైట్‌కు ఎడిటర్‌గా వ్యవహారిస్తున్నారు. మరోవైపు దీనిపై పీసీబీ ఛైర్మన్ ఇషాన్ మనీ మాత్రం "ఇతర ఆటగాళ్లు ఏం చేసినా మాకు అనవసరం, ఒకవేళ మా ఆటగాళ్లు సెంచరీ చేస్తే వైవిధ్యంగా సంబరపడొచ్చు. 2016లో లార్డ్స్‌ టెస్టులో సెంచరీ చేసిన మిస్బా ఉల్‌ హాక్‌ పుషప్స్‌ తీసి ఆర్మీ అధికారులకు నివాళి అర్పించాడు. అంతకుమించి వికెట్లు తీసి సంబరపడటానికి ఏమీ లేదు" అని ట్వీట్ చేశాడు.

ధోని ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌' వివాదం

ధోని ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌' వివాదం

దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌' లోగోతో ఉన్న గ్లోవ్స్‌ను ధరించడంపై పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఈ వార్త వెలుగులోకి రావడం భారత్-పాక్ మ్యాచ్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది. ధోని ధరించిన ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌'పై ఐసీసీ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. అది సైన్యానికి సంబంధించిన గుర్తు కాదని బీసీసీఐ లేఖ రాసినప్పటికీ ఐసీసీ సంతృప్తి చెందలేదు.

దేశభక్తిని చాటేందుకే ధోని అలా చేశాడు

దేశభక్తిని చాటేందుకే ధోని అలా చేశాడు

ధోని ధరించిన గ్లోవ్స్‌ మీద ఉన్న ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌' లోగోని తొలగించాల్సిందేనని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) స్పష్టం చేసింది. ధోని ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌'ను గ్లోవ్స్‌ మీద ముద్రించడం వెనుక ఎలాంటి రాజకీయ, వాణిజ్య ప్రయోజనాలు లేవని బీసీసీఐ వివరణ ఇచ్చింది. దేశభక్తిని చాటేందుకే ధోని అలా చేశాడు కాబట్టి బలిదాన్‌ బ్యాడ్జ్‌ ఉన్న గ్లోవ్స్‌ను తదుపరి మ్యాచ్‌ల్లో కూడా కొనసాగనివ్వాలని ఐసీసీని బీసీసీఐ కోరిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, June 8, 2019, 13:18 [IST]
Other articles published on Jun 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X