న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్, వార్నర్‌ లాగే.. బాల్‌ ట్యాంపరింగ్‌కి పాల్పడిన పాక్ క్రికెటర్!!

Pakistan player Ahmed Shehzad charged with ball tampering

కరాచీ: పాకిస్థాన్‌ క్రికెటర్ అహ్మద్‌ షెహజాద్‌ బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో కైద్‌ ఇ అజామ్‌ ట్రోఫీలో భాగంగా సెంట్రల్‌ పంజాబ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న షెహజాద్‌.. సింధ్‌ జట్టుతో తలపడిన మ్యాచ్‌లో బంతి స్వరూపాన్ని మార్చేందుకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మీడియా ఓ ట్వీట్‌ చేసింది. దీంతో సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్తాన్‌ జట్టులో పునరాగమనం చేసిన షెహజాద్‌ మళ్లీ కష్టాల్లో పడ్డాడు.

<strong>ఫరూక్‌ ఇంజినీర్‌ యూటర్న్‌: జోక్‌ చేశా.. అనుష్కశర్మకు క్షమాపణలు!!</strong>ఫరూక్‌ ఇంజినీర్‌ యూటర్న్‌: జోక్‌ చేశా.. అనుష్కశర్మకు క్షమాపణలు!!

బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం

బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం

'సెంట్రల్‌ పంజాబ్‌ కెప్టెన్‌ అహ్మాద్‌ షెహజాద్‌ బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. అతడు బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడ్డాడు. షెహజాద్‌పై విచారణ చేపట్టాం. అతనిపై త్వరోలోనే చర్యలు తీసుకుంటాం' అని పీసీబీ మీడియా ఒక ప్రకటనలో తెలిపింది. ఫైసలాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో షెహజాద్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడాన్ని గుర్తించిన మ్యాచ్‌ రిఫరీ నదీం అర్షద్‌ అతడికి సమన్లు జారీ చేశాడు. శుక్రవారం అతడికి శిక్ష విధించే అవకాశం ఉంది.

గతంలోనూ సస్పెన్షన్‌

గతంలోనూ సస్పెన్షన్‌

అహ్మద్‌ షెహజాద్‌ క్రమ శిక్షణా నియమావళిని ఉల్లంఘించడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఓ వివాదంలో చిక్కుకొని శిక్షకు గురయ్యాడు. 2018లో పీసీబీ యాంటీ డోపింగ్‌ నియమాలను ఉల్లంఘించిన నేపథ్యంలో గత ఏడాది జులై 10న నాలుగు నెలల పాటు సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నాడు. పాకిస్థాన్‌ దేశావాళీ క్రికెట్‌ సందర్భంగా ఆటగాళ్లకి నిర్వహించిన డోపింగ్‌ పరీక్షల్లో అతడు పాజిటివ్‌గా తేలాడు.

డైలమాలో షెహజాద్‌ కెరీర్

సస్పెన్షన్‌ అనంతరం ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా షెహజాద్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సిరీస్‌లో అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు. అయితే హెడ్ కోచ్‌, సెలెక్టర్ మిస్బావుల్‌ హక్‌ మాత్రం షెహజాద్‌కు మద్దతుగా నిలిచాడు. అన్ని కుదురుకుంటున్న సమయంలో ఇలా బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న షెహజాద్‌పై పీసీబీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మొత్తానికి షెహజాద్‌ కెరీర్ డైలమాలో పడింది. షెహజాద్‌ పాక్ తరఫున 13 టెస్టులు, 81 వన్డేలు, 59 టి20 మ్యాచ్‌లు ఆడాడు.

Story first published: Friday, November 1, 2019, 12:35 [IST]
Other articles published on Nov 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X