న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌన్సర్ తాకి నేలకొరిగిన పాక్ ఓపెనర్

Pakistan opener Imam-ul-Haq hit by a bouncer from Lockie Ferguson during 2nd ODI

హైదరాబాద్: పాకిస్థాన్ ఓపెనర్.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్ మేనల్లుడు.. ఇమామ్ ఉల్ హక్ కొద్దిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. న్యూజిలాండ్‌తో అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో ఫాస్ట్ బౌలర్ లూకీ ఫర్గూసన్ విసిరిన ఓ బౌన్సర్ బంతి ఇమామ్ హెల్మెట్‌కి బలంగా తాకింది. శరీరంపైకి వచ్చి దూసుకొచ్చిన బంతిని.. ఫుల్ చేసేందుకు ఇమామ్ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి అందని బంతి నేరుగా వచ్చి హెల్మెట్‌ని తాకింది.

మోకాళ్లపైకి ఒరిగి.. నేలపై

దీంతో.. కొన్ని క్షణాలపాటు నొప్పితో విలవిలాడిన ఇమామ్ మోకాళ్లపైకి ఒరిగి.. అనంతరం నేలపై పడుకుండిపోయాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా మైదానంలోని ఆటగాళ్లు.. ప్రేక్షకులు కలవరపాటు గురయ్యారు. వెంటనే మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన ఫిజియో ఇమామ్‌కు ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశాడు.

హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో

కానీ ఇమామ్‌ గాయం తీవ్రంగా ఉండటంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించామని భయపడాల్సిన గాయం కాదని పాక్‌ క్రికెట్‌ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. షోయబ్‌ మాలిక్‌ సైతం ఇమామ్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ అతను బాగానే ఉన్నాడని తెలిపాడు. ఇమామ్ గాయంపై ఇప్పటికీ అధికారిక ప్రకటన రాకపోవడంతో.. మూడో వన్డేలో అతను ఆడటంపై అనుమానం నెలకొంది.

6 వికెట్ల తేడాతో విజయం సాధించిన పాక్

6 వికెట్ల తేడాతో విజయం సాధించిన పాక్

న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే. కివీస్‌ బౌలర్‌ లాకీ ఫెర్గూసన్ వేసిన బౌన్సర్.. ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్‌ హ్యూస్‌ను గుర్తుచేసింది. ఆసీస్‌ బౌలర్‌ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి 2014 నవంబరులో ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

వరుస(12) పరాజయాలకు అడ్డుకట్టగా

వరుస(12) పరాజయాలకు అడ్డుకట్టగా

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ రాస్‌ టేలర్‌ (86), హెన్రీ నికోలస్‌(33), వర్కర్‌ (28) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవ్వడంతో 9 వికెట్లు నష్టానికి 209 పరుగులే చేసింది. అనంతరం పాక్‌.. ఫకార్‌ జమాన్‌ (88), బాబర్‌ అజమ్‌ (46)లు రాణించడంతో 40.3 ఓవర్లోనే లక్ష్యాన్ని అందుకుంది. ఈ గెలుపుతో కివీస్‌పై వరుస(12) పరాజయాలకు అడ్డుకట్ట వేసింది.

Story first published: Saturday, November 10, 2018, 15:32 [IST]
Other articles published on Nov 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X