న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోపంతో ఊగిపోయిన ఫ్యాన్.. పాక్‌ కెప్టెన్‌ కటౌట్‌ను కసితీరా తన్నాడు!!(వీడియో)

Pakistan fan destroys Captain Sarfaraz Ahmeds hoarding post loss against Sri Lanka

ఇస్లామాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపఖండంలో అయితే ఈ ఫాలోయింగ్‌ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక ఆటగాళ్లు తమ జట్లకు చిరస్మరణీయ విజయాలు అందించి అభిమానుల గుండెల్లో నిలుస్తుంటారు. అయితే ఆటగాళ్లు జట్టుకు విజయం అందించినపుడు వీరాభిమానులు వారిని ఆకాశానికెత్తేస్తారు. అదే ఓడిపోయిన సమయాల్లో వారిపై కోపం ప్రదర్శించడానికి కూడా వెనకాడరు. ఇలాంటి ఘటనే తాజాగా పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది.

<strong>జడేజా మెరుపు అర్ధ సెంచరీ.. 601/5 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన భారత్</strong>జడేజా మెరుపు అర్ధ సెంచరీ.. 601/5 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన భారత్

అభిమానులు ఆగ్రహం:

అభిమానులు ఆగ్రహం:

తాజాగా శ్రీలంక జట్టు పాకిస్తాన్‌లో పర్యటించింది. మొదటగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను పాక్ 2-0తో కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన టీ20 సిరీస్‌లో మాత్రం పాక్ 3-0తో సిరీస్‌ను కోల్పోయింది. ఆడిన మూడు మ్యాచ్‌లలో పాక్ ఘోర పరాజయాలను ఎదుర్కొంది. సుదీర్ఘ కాలంగా టీ20ల్లో వైట్‌వాష్ గురికాని పాక్‌.. లంక జట్టుకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, కోచ్‌ మిస్బావుల్‌ హక్‌పై పాక్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కటౌట్‌ను కసితీరా తన్నాడు

టీ20లలో పాక్ ఓటమి తట్టుకోలేని ఓ అభిమాని తన కోపాన్ని అంతా కటౌట్‌పై చూపించాడు. కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ కటౌట్‌ను సదరు అభిమాని కసితీరా కొట్టి.. అనంతరం కాలితో తన్ని పూర్తిగా నేలమట్టం చేసాడు. ఇక కోపంతో ఊగిపోతూ తిట్ల వర్షం కూడా కురిపించాడు. దీనికి పక్కనే ఉన్న ఇతర అభిమానులు కూడా గట్టిగా అరుస్తూ మద్దతు పలికారు. అయితే ఈ ఘటన చివరిదైన మూడో టీ20 అనంతరం జరిగినట్టు సమాచారం తెలుస్తోంది.

 నెట్టింట్లో వైరల్‌

నెట్టింట్లో వైరల్‌

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సాజ్‌ సాదిఖ్‌ అనే నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరేమో పాక్ జట్టుకు మద్దతుగా నిలిస్తే.. మరికొందరేమో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక కొందరు పాక్ అభిమానులు ఈ వీడియోను డిలీట్ చేయాలని కోరుతున్నారు. ఇక జట్టు ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని సర్ఫరాజ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Story first published: Friday, October 11, 2019, 17:33 [IST]
Other articles published on Oct 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X