న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ ఎఫెక్ట్: పాకిస్థాన్‌ జట్టుకు ఇద్దరు కెప్టెన్లు!

Pakistan could have separate captains and head coaches for Test and limited-overs teams, say PCB sources

హైదరాబాద్: ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌ లీగ్ దశలోనే నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టు ప్రక్షాళన దిశగా ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) దృష్టి సారించింది. ఇందులో భాగంగా టెస్టు, పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లతో పాటు కోచ్‌లను నియమించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్

ఈ విషయమై ఈ నెలాఖరున పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సమావేశం కానుంది. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ "టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సీజన్‌లో శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ టెస్టులన్నీ కూడా వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఆడేవే" అని ఆయన తెలిపారు.

"ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్‌లో జట్టు ప్రదర్శన మెరుగవ్వాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు యోచిస్తోంది. ఇక, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సర్ఫరాజ్ సారధ్యంతో సంతృప్తిగానే ఉన్న బోర్డు సంప్రదాయ క్రికెట్‌లో మాత్రం కెప్టెన్సీ మార్చే ఉద్దేశంలో ఉన్నట్లు" ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న పాక్.. వన్డేల్లో ఆరో స్థానంలో, టెస్టుల్లో 7వ స్థానంలో కొనసాగుతోంది.

ఇక, టెస్టుల్లో పాకిస్థాన్ జట్టు కెప్టెన్‌గా అసద్ షఫీక్, అజహర్ అలీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు టెస్టుల కోసం ప్రత్యేక కోచ్‌ను కూడా ఎంపిక చేసే పనిలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉన్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Story first published: Monday, July 22, 2019, 12:41 [IST]
Other articles published on Jul 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X