న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నెట్ రన్‌రేట్ విధానాన్ని మార్చండి: టోర్నీ నిష్క్రమణపై ఐసీసీకి పాక్ కోచ్

Pakistan Coach Mickey Arthur Asks ICC To Reconsider Net Run-Rate Rule After World Cup Exit

హైదరాబాద్: పాకిస్థాన్‌ తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాపై 94 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అందుకు కారణం పాకిస్థాన్ టాప్-4లో చోటు దక్కించుకోలేకపోవడమే. పాక్ లీగ్‌ దశ ముగించే సరికి 11 పాయింట్లతో ఉంది. న్యూజిలాండ్‌ సైతం 11 పాయింట్లతో ఉన్నప్పటికీ నెట్‌రన్‌రేట్‌లో మెరుగ్గా ఉండడంతో ఆ జట్టు సెమీస్‌కి అర్హత సాధించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మరోవైపు పాక్ ఐదో స్థానానికి మాత్రమే పరిమితమైన టోర్నీ నుంచి నిష్క్రమించింది. కివీస్‌తో సమానంగా పాయింట్లు సాధించినప్పటికీ... నాకౌట్‌ చేరకుండానే నిష్క్రమించడం ఆ జట్టు కోచ్‌ మికీ ఆర్థర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతేకాదు నెట్‌ రన్‌రేట్‌ విధానాన్ని మార్చాలంటూ ఐసీసీని కోరాడు.

విండిస్ చేతిలో ఘోర ఓటమే

విండిస్ చేతిలో ఘోర ఓటమే

విండిస్ చేతిలో ఘోర ఓటమే తమ జట్టు సెమీస్‌ చేరకపోవడానికి ప్రధాన కారణమనికోచ్ మికీ ఆర్థర్‌ తెలిపాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గెలిచే అవకాశమున్నా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయామని ఆర్థర్‌ తన ఆవేదన వెళ్లగక్కాడు. ఈ రెండు ఓటములే తనకు పీడకలలా మిగిలిపోతాయని అన్నాడు.

మికీ ఆర్థర్‌ మాట్లాడతూ

మికీ ఆర్థర్‌ మాట్లాడతూ

మికీ ఆర్థర్‌ మాట్లాడతూ "విండిస్ చేతిలో ఘోర పరాభవం చూడటం పాక్‌ జట్టు సెమీస్‌ అవకాశాల్ని దెబ్బ తీసింది. ఇక ఆసీస్‌తో మ్యాచ్‌లో కూడా మేము గెలవాల్సిన ఉన్నా అది జరగలేదు. పేలవ ప్రదర్శనతోనే మా సెమీస్‌ దారులు మూసుకుపోవడం చాలా బాధాకరం. మళ్లీ మేం గాడిలో పడినప్పటికీ నెట్‌ రన్‌రేట్‌తో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది" అని అన్నాడు.

మా డ్రెస్సింగ్‌ రూమ్‌ నిరుత్సాహపరిచింది

మా డ్రెస్సింగ్‌ రూమ్‌ నిరుత్సాహపరిచింది

"ఇది మా డ్రెస్సింగ్‌ రూమ్‌ నిరుత్సాహపరిచింది. బంగ్లాదేశ్‌పై గెలిచిన తర్వాత కూడా మేము అభినందనలు చెప్పుకోలేకపోయాం. అయితే ఈ టోర్నీలో సెమీస్‌ చేరిన న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ జట్లని పాకిస్థాన్‌ జట్టు ఓడించడం సంతోషంగా ఉంది. ఏది ఏమైనా సెమీస్‌ రేసులో ఉన్న నాలుగు జట్లకు అభినందనలు. వారు మంచి క్రికెట్‌ ఆడిన కారణంగానే సెమీస్‌కు వెళ్లారు. అత్యుత్తమ జట్టునే ట్రోఫీ వరిస్తుంది" అని ఆర్థర్‌ అన్నాడు.

బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో తొలి పది ఓవర్లలో

బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో తొలి పది ఓవర్లలో

బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో తొలి పది ఓవర్లలో శుభారంభం లభిస్తే 400పైగా స్కోర్‌ చెయ్యాలని అనుకున్నామని... అయితే ఫకార్‌ జమాన్‌ ఔటైన తర్వాత బ్యాటింగ్‌ కష్టంగా ఉందని ఆర్థర్‌ చెప్పాడు. అప్పుడు 270 పరుగులు చేసి బంగ్లాను కట్టడి చెయ్యాలని నిర్ణయించుకున్నాం. ఆ పిచ్‌పై 400 పరుగులు చెయ్యడమంటే ఆత్యాశే అవుతుందని ఆర్థర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, July 6, 2019, 17:29 [IST]
Other articles published on Jul 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X