న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కశ్మీరీలకు అల్లా సాయం చేయాలని ప్రార్థించా: పాకిస్థాన్ కెప్టెన్

 Pakistan Captain Sarfraz Ahmed Vows to Stand by Kashmiris Post Abrogation of Article 370

హైదరాబాద్: జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందించాడు. ఇది కశ్మీరీ సోదరులకు కష్ట కాలంగా అభివర్ణించిన సర్పరాజ్‌... యావత్ దేశం మొత్తం కశ్మీర్ సోదరులకు మద్దతుగా ఉందని చెప్పాడు.

కరాచీలో ఈద్ ఈద్‌ ప్రార్థనలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన సర్పరాజ్‌ అహ్మద్ ఆర్టికల్ 370 రద్దుపై మాట్లాడుతూ "ఈ ఆపద నుంచి గట్టెక్కించేందుకు కశ్మీరీలకు అల్లా సాయం చేయాలని ప్రార్థించాను. కశ్మీరీ సోదరులారా.. బాధను, కష్టాలను సమానంగా పంచుకుందాం. యావత్‌ పాకిస్థాన్ మీకు అండగా ఉంటుంది" అని సర్పరాజ్‌ అన్నాడు.

<strong>ప్రపంచకప్ ఫైనల్: ఓవర్‌త్రోలో స్టోక్స్-గుప్టిల్ పాత్రపై సెప్టెంబర్‌లో సమీక్ష!</strong>ప్రపంచకప్ ఫైనల్: ఓవర్‌త్రోలో స్టోక్స్-గుప్టిల్ పాత్రపై సెప్టెంబర్‌లో సమీక్ష!

షాహిద్ అఫ్రిది తన అక్కసుని ట్విట్టర్‌లో

షాహిద్ అఫ్రిది తన అక్కసుని ట్విట్టర్‌లో

అంతకముందు ఆర్టికల్ 370 రద్దుపై భారత ప్రభుత్వం తీరుని తప్పుబడుతూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తన అక్కసుని ట్విట్టర్‌లో వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని... ఆర్టికల్ 370 రద్దు జరుగుతుంటే ఐక్యరాజ్యసమితి నిద్రపోతుందా? అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించాడు.

నా నుంచి అద్భుతాలు ఆశించొద్దు: లార్డ్స్‌లో టెస్టు అరంగేట్రంపై జోఫ్రా ఆర్చర్

కశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు

"ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు. స్వేచ్చ విషయంలో అందరికీ సమాన హక్కులు వర్తిస్తాయి. ఇంత జరుగుతుంటే ఐక్యరాజ్య సమితి ఎందుకు నిద్రపోతోంది. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఎందుకు స్పందించట్లేదు. అసలు ఐక్యరాజ్య సమితిని ఎందుకు ఏర్పాటు చేశారు? కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి" అంటూ అఫ్రిది తన ట్వీట్టర్‌లో పేర్కొన్నాడు.

ఘాటుగా స్పందించిన గంభీర్

అఫ్రిది ట్విట్టర్ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కాస్తంత ఘాటుగానే స్పందించాడు. "అఫ్రిది.. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది వాస్తవమే. ఈ విషయాన్ని అంగీకరించిన నిన్ను అభినందించాల్సిందే. కానీ నువ్వు మరిచిపోయిన విషయం ఏంటంటే.. ఇవన్నీ పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లో జరుగుతున్నాయని ప్రస్తావించకపోవడం. ఏం బాధపడకు త్వరలో ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం" అంటూ గంభీర్ తనదైన శైలిలో అఫ్రిదికి సమాధానమిచ్చాడు.

Story first published: Tuesday, August 13, 2019, 13:24 [IST]
Other articles published on Aug 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X