న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs SL: రెండో టీ20లోనే హ్యాట్రిక్‌.. పాకిస్థాన్‌ బౌలర్ ప్రపంచ రికార్డు!!

Pakistan bowler Mohammad Hasnain Becomes Youngest To Claim T20I Hat Trick

లాహోర్‌: పాకిస్థాన్‌ యువ పేసర్ మహ్మద్‌ హస్నేన్‌ (19) ప్రపంచ రికార్డు నమోదు చేసాడు. ఆడిన రెండో టీ20లోనే హ్యాట్రిక్‌ సాధించి రికార్డుల్లోకి ఎక్కాడు. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం లాహోర్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో హస్నేన్‌ హ్యాట్రిక్‌ సాధించాడు. లంక తొలుత బ్యాటింగ్‌ చేయగా.. మహ్మద్‌ హస్నేన్‌ తన కోటా నాలుగు ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

<strong>IND vs SA: విశాఖ టెస్ట్: భారత బౌలర్ల హవా.. దక్షిణాఫ్రికా 33/3</strong>IND vs SA: విశాఖ టెస్ట్: భారత బౌలర్ల హవా.. దక్షిణాఫ్రికా 33/3

పిన్న వయస్కుడిగా చరిత్ర

పిన్న వయస్కుడిగా చరిత్ర

లంక ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ చివరి బంతికి రాజపక్ష (32)ను హస్నేన్‌ ఔట్‌ చేశాడు. అనంతరం 19వ ఓవర్‌లో తొలి రెండు బంతులకు షనక (17), శెహన్‌ జయసూర్య (2)లను ఔట్ చేసి హ్యాట్రిక్‌ నమోదుచేసాడు. దీంతో టీ20ల్లో హ్యాట్రిక్‌ సాధించిన పిన్న వయస్కుడిగా (19 ఏళ్ల 183 రోజులు) హస్నేన్‌ చరిత్ర సృష్టించాడు. తొలి రెండు ఓవర్లు ఎక్కువ పరుగులిచ్చిన హస్నేన్‌.. అనంతరం పుంజుకుని హ్యాట్రిక్‌ తీసాడు. అయితే హస్నేన్‌ హ్యాట్రిక్‌ పాక్ విజయానికి సరిపోలేదు. 64 పరుగులతో పాక్ ఓడిపోయింది.

హస్నేన్‌ హ్యాట్రిక్‌

హస్నేన్‌ హ్యాట్రిక్‌

పాకిస్తాన్‌ చేతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన శ్రీలంక టీ20 సిరీస్‌లో మాత్రం శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో శ్రీలంక 64 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత లంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. గుణతిలక (38 బంతుల్లో 57; 8 ఫోర్లు, సిక్స్‌) ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ చేసాడు. ఫెర్నాండో (33), రజపక్సే (32) ఫర్వాలేదనిపించారు. పాక్‌ బౌలర్లలో హస్నేన్‌ (3/37) హ్యాట్రిక్‌ తీసాడు.

101 పరుగులకు ఆలౌట్

101 పరుగులకు ఆలౌట్

అనంతరం లక్ష్య ఛేదనలో పాక్‌ 17.4 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. నువాన్ ప్రదీప్ రెండో ఓవర్లో బాబర్ ఆజమ్ వికెట్ తీసి లంకకు శుభారంభం అందించాడు. అక్కడి నుండి పాక్ ఏ దశలోనూ కోలుకోలేదు. పురాగమనం చేసిన ఉమర్ అక్మల్ కూడా డకౌట్ అయ్యాడు. ఇఫ్తిఖార్‌ (25) టాప్‌ స్కోరర్‌. లంక బౌలర్లలో నువాన్‌ ప్రదీప్‌ (3/21), ఉడాన (3/11) రాణించారు.

పాకిస్థాన్‌కు షాక్

పాకిస్థాన్‌కు షాక్

అద్భుత ఆటతో ఆకట్టుకున్న గుణతిలకకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది. ఈ పరాజయంతో సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో శ్రీలంక 1-0తో ఆధిక్యం సంపాదించింది. సిరీస్‌లోని రెండో మ్యాచ్‌ సోమవారం జరుగుతుంది.

Story first published: Sunday, October 6, 2019, 11:16 [IST]
Other articles published on Oct 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X