న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENGvsPAK : ఓడినా షేక్ హ్యాండ్ ఇవ్వని టెయిలెండర్.. బెన్ స్టోక్స్ ఏం చేశాడంటే?

 Pakistan batter refuses to shake hands with Ben Stokes

పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన టెస్టు మ్యాచులో చివరకు విజయం ఇంగ్లండ్‌నే వరించింది. రెండో టెస్టులో 26 పరుగుల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్.. పాక్ గడ్డపై వరుసగా రెండు విజయాలు నమోదు చేసి చరిత్ర సృష్టించింది. అయితే ఇది పాక్‌కు స్వదేశంలో వరుసగా మూడో టెస్టు ఓటమి కావడం గమనార్హం.

ఈ మ్యాచ్‌లో జరిగిన ఒక ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నాలుగో రోజు ఆట ఆరంభమయ్యే సమయానికి పాకిస్తాన్ జట్టు 4 వికెట్ల నష్టానికి 198 పరుగులతో ఉన్న పాక్ జట్టు.. మార్క్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కుప్పకూలింది. చివరకు 319/9 స్కోరుతో నిలిచింది. ఇలాంటి సమయంలో క్రీజులో ఉన్న మహమ్మద్ అలీ కూడా కాసేపటికే అవుట్ అయ్యాడు. ఓలీ రాబిన్సన్ వేసిన బంతి.. అలీ బ్యాటును ముద్దాడుతూ వెళ్లి కీపర్ చేతుల్లో పడింది.

ఇది చూసిన ఇంగ్లండ్ జట్టు అప్పీల్ చేయగా అంపైర్ అవుటిచ్చాడు. అంతే ఇంగ్లండ్ టీం అంతా సంబరాల్లో మునిగిపోయింది. అయితే అలీ మాత్రం చివరి అవకాశంగా డీఆర్ఎస్ కోరాడు. థర్డ్ అంపైర్ ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తుండగానే ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్ తొందరపడ్డాడు. జట్టుతో సంబరాలు చేసుకొని వెనక్కు తిరిగి మహమ్మద్ అలీకి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. దీంతో చిరాకు పడిన అలీ అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.

స్టోక్స్‌తో అలీ ఏదో అనడంతో ఇంగ్లండ్ సారధి వెనకడుగు వేశాడు. తనదే పొరపాటు అన్నట్లు సైగ చేశాడు. అయితే ఆ వెంటనే పెద్ద స్క్రీన్‌పై అలీ అవుట్ అని నిర్ణయం వచ్చింది. దీంతో అందరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ఇలా అలీ షేక్ హ్యాండ్ నిరాకరించడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Story first published: Tuesday, December 13, 2022, 14:42 [IST]
Other articles published on Dec 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X