న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉమర్‌ అక్మల్‌కు భారీ ఊరట.. సస్పెన్షన్‌ సగానికి కుదింపు!!

Pakistan batsman Umar Akmal’s ban halved to 18 months

కరాచీ: పాకిస్తాన్ సీనియర్ బ్యాట్స్‌మన్‌ ఉమర్ అక్మల్‌కు భారీ ఊరట లభించింది. తాజాగా అక్మల్‌పై ఉన్న మూడేళ్ల నిషేధాన్ని సగానికి కుదిస్తూ స్వతంత్ర్య న్యాయ నిర్ణేత, పాకిస్థాన్‌ మాజీ సుప్రీం కోర్టు జడ్జి ఫకిర్‌ మహమ్మద్‌ ఖోఖర్‌ తీర్పు వెల్లడించారు. రెండు వేర్వేరు సందర్భాల్లో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక చట్టాన్ని వికెట్‌ కీపర్‌ ఉల్లంఘించాడంటూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌, జస్టిస్‌ ఫజల్‌-ఇ-మిరాన్‌ చౌహాన్‌ గత ఏప్రిల్‌ 27న అక్మల్‌పై మూడేళ్ల నిషేధాన్ని విధించారు.

అయితే తన తప్పును క్షమించాలని, శిక్షను తగ్గించాలంటూ ఉమర్ అక్మల్‌ మే 19న అప్పీల్‌ దాఖలు చేశాడు. దీనిపై స్పందించిన న్యాయ నిర్ణేత ఫకిర్‌ మహమ్మద్‌ ఖోఖర్ అక్మల్‌పై సగం శిక్షను తగ్గించి నిషేధాన్ని 18 నెలలకు కుదించారు. అక్మల్‌పై ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది ఆగస్టు వరకు నిషేధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి మూడేళ్ల నుంచి ఏడాదిన్నరకు శిక్షాకాలం తగ్గింది. అయితే ఈ నిర్ణయంపై సంతృప్తి చెందని ఉమర్ అక్మల్‌‌ శిక్షను తగ్గించుకునేదుకు మరిన్ని ప్రయత్నాలు చేస్తానని చెప్పాడు.

'నా లాయర్‌ వాదనలు విన్నందుకు న్యాయమూర్తికి ధన్యవాదాలు. ఈ తీర్పుతో నేను అస్సలు సంతృప్తిగా లేను. శిక్షను తగ్గించుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు చేస్తాను. ఇందుకు నా లాయర్‌, కుటుంబసభ్యుల సలహాలు తీసుకుంటా. నా కంటే ముందు ఎందరో ఆటగాళ్లు తప్పులు చేశారు. వారందరికి చిన్న శిక్ష వేశారు. కానీ నాకు మాత్రం పెద్ద శిక్ష వేశారు' అని ఉమర్ అక్మల్‌ అంటున్నాడు.

ఈ ఏడాది పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌కు ముందు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం కొందరు తనను సంప్రదించిన విషయాన్ని తెలపనందుకు ఉమర్ అక్మల్‌పై పీసీబీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అక్మల్‌ మూడేళ్ల పాటు ఏ ఫార్మాట్‌లోనూ ఆడకుండా‌ నిషేధం విధించారు. గతేడాది ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ తరపున అక్మల్ చివరిసారి ఆడాడు. ఆ సిరీస్‌లో అక్మల్‌ విఫలం కావడంతో.. అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పాకిస్తాన్‌ జట్టులో చోటు కోల్పోయాడు. ఇక పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ ఆడేందుకు సిద్దమయ్యాడు. కానీ.. ఇంతలోనే పీసీబీ అతనికి ఊహించని షాక్ ఇచ్చింది.

29 ఏళ్ల ఉమర్‌ అక్మల్‌ మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ కమ్రాన్‌ అక్మల్‌కు సొంత తమ్ముడు. ప్రస్తుత కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌కు కూడా వరుసకు సోదరుడవుతాడు. ఉమర్‌ అంతర్జాతీయ కెరీర్‌లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టీ20లు ఆడాడు.టెస్టుల్లో ఒకటి, వన్డేల్లో రెండు శతకాలు బాదాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 34 అర్ధ శతకాలు చేశాడు.

ఆ ఆరు సిక్సుల గురించి మర్చిపోండి.. బ్రాడ్‌ను మ‌న‌స్పూర్తిగా అభినందించండి: యూవీఆ ఆరు సిక్సుల గురించి మర్చిపోండి.. బ్రాడ్‌ను మ‌న‌స్పూర్తిగా అభినందించండి: యూవీ

Story first published: Wednesday, July 29, 2020, 19:10 [IST]
Other articles published on Jul 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X