న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డబుల్ సెంచరీ: తాత, తండ్రి రికార్డుని సమం చేసిన క్రికెటర్

Pakistan Batsman Emulates Father-Grandfather In Setting Unique Record

హైదరాబాద్: పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్‌లో ఓ అరుదైన సందర్భం చోటు చేసుకుంది. పాకిస్థాన్ క్రికెటర్ షెజార్ మొహమ్మద్ తన తాత, తండ్రి రికార్డులను సమం చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాక్ క్రికెటర్ షెజార్ మొహమ్మద్ దేశవాళీ క్రికెట్‌లో 265 పరుగులు చేసి ఈ అరుదైన ఘనత సాధించాడు.

<strong>మరిన్ని చిక్కుల్లో పడ్డ బీసీసీఐ బాస్: ఐసీసీ మీటింగ్ నుంచి పేరు తప్పించారు</strong>మరిన్ని చిక్కుల్లో పడ్డ బీసీసీఐ బాస్: ఐసీసీ మీటింగ్ నుంచి పేరు తప్పించారు

ఈ డబుల్ సెంచరీ సాధించడం ద్వారా హెజార్ తన తాత, తండ్రి, అంకుల్, మరో ఇద్దరు తాతల రికార్డును సమం చేశాడు. వీరంతా గతంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు కావడం విశేషం. ఈ షెజార్ మొహమ్మద్ మరెవరో కాదు.. పాకిస్థాన్ లెజెండరీ క్రికెటర్ హనీఫ్ మొహమ్మద్ మనవడు.

పాక్ తరఫున 55 టెస్టులు ఆడిన హనీఫ్

పాక్ తరఫున 55 టెస్టులు ఆడిన హనీఫ్

పాక్ తరఫున 55 టెస్టులు ఆడిన హనీఫ్ మొహమ్మద్ 43.98 యావరేజితో పరుగులు సాధించాడు. హనీఫ్ మొహమ్మద్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ అత్యధిక స్కోరు 499 పరుగులు కావడం విశేషం. అంతేకాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన రికార్డు కూడా హనీఫ్ పేరిటే ఉంది.

970 నిమిషాల పాటు క్రీజులో

970 నిమిషాల పాటు క్రీజులో

1957-58లో వెస్టిండిస్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 16 గంటల 10 నిమిషాలు(970 నిమిషాలు) పాటు క్రీజులో నిలిచి 337 పరుగులు చేశాడు. ఇక, షెజార్ తండ్రి షోయబ్ మొహమ్మద్ విషయానికి వస్తే పాకిస్థాన్ తరఫున 45 టెస్టులు, 63 వన్డేలు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 208.

తాత, తండ్రి బాటలో డబుల్ సెంచరీ చేసిన షెజార్

తాత, తండ్రి బాటలో డబుల్ సెంచరీ చేసిన షెజార్

ఇక హనీఫ్ సోదరులు సాదిఖ్, ముష్తాక్.. సాదిక్ కొడుకు ఇమ్రాన్ కూడా తమ కెరీర్‌లలో డబుల్ సెంచరీలు నమోదు చేశారు. ఇప్పుడు షెజార్ కూడా వాళ్ల బాటలోనే డబుల్ సెంచరీ సాధించడం విశేషం. తన కెరీర్‌లో 36వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న షెజార్ 464 బంతుల్లో 265 పరుగులతో డబుల్ సెంచరీ సాధించాడు.

క్రికెట్ తమ రక్తంలోనే ఉందని తేలింది

క్రికెట్ తమ రక్తంలోనే ఉందని తేలింది

దేశవాళీ క్రికెట్‌లో భాగంగా ముల్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కరాచీ వైట్స్ జట్టు తరుపున షెజార్ మొహమ్మద్ ప్రాతినిథ్యం వహించాడు. షెజార్ డబుల్ సెంచరీ చేయడంతో కరాచీ వైట్స్ జట్టు 600-6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మ్యాచ్ అనంతరం షెజార్ తండ్రి షోయబ్ మొహమ్మద్ జియో టీవికి ఇచ్చిన ఇంటర్యూలో "మొహమ్మద్ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఇదొక అద్భుతమైన సందర్భం. క్రికెట్ తమ రక్తంలోనే ఉందని తేలింది. హనీఫ్ బతికి ఉండి ఉంటే ఎంతో గర్వించేవాడు" అని షోయబ్ అన్నాడు.

Story first published: Monday, October 15, 2018, 15:37 [IST]
Other articles published on Oct 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X