న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డకౌట్ ఎఫెక్ట్: టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మహమ్మద్‌ హఫీజ్‌

Pakistan all-rounder Muhammad Hafeez retires from Test cricket

హైదరాబాద్: పాకిస్థాన్‌ సీనియర్ బ్యాట్స్‌మన్‌ మహమ్మద్‌ హఫీజ్‌ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అబుదాబి వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడోటెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హఫీజ్‌ డకౌటయ్యాడు. తన కెరీర్‌లో 55వ టెస్టు మ్యాచ్ ఆడుతోన్న హఫీజ్ డకౌట్ అయిన వెంటనే టెస్టులకు రిటైర్మెంట్ చెబుతున్నట్లు ప్రకటించాడు.

సచిన్, గంగూలీ, లక్ష్మణ్ కాదు: మహిళల కోచ్ ఎంపికలో కపిల్‌, గైక్వాడ్‌? సచిన్, గంగూలీ, లక్ష్మణ్ కాదు: మహిళల కోచ్ ఎంపికలో కపిల్‌, గైక్వాడ్‌?

గత రెండు వారాలుగా తన రిటైర్మెంట్‌పై ఆలోచన చేస్తున్నానని చెప్పిన హఫీజ్.... పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని తెలిపాడు. ఈ సందర్భంగా హఫీజ్ మాట్లాడుతూ "ఇది నా వ్యక్తిగత నిర్ణయం, ఎవరి ఒత్తిడి నాపై లేదు. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎలాంటి బాధ లేదు" అని చెప్పాడు.

38 ఏళ్ల హఫీజ్‌ 2003లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. పాక్ తరుపున ఇప్పటివరకు 54 టెస్టులాడిన హఫీజ్ 38.35 సగటుతో 3644 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 203 వన్డేలు, 89 టీ20లు కూడా ఆడాడు.

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌‌తో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అజహర్‌ అలీ (62 బ్యాటింగ్‌)తో ఆదుకున్నాడు. 17 పరుగులకే ఓపెనర్లు హఫీజ్‌ (0), ఇమాముల్‌ హక్ (9) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన పాక్‌ను హారిస్‌ సొహైల్‌ (34; 2 ఫోర్లు), అసద్‌ షఫీఖ్‌ (26 బ్యాటింగ్‌)లతో కలిసి అజహర్ అలీ ఆదుకున్నాడు. 229/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో మంగళవారం ఆట కొనసాగించిన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగుల వద్ద ఆలౌటైంది.

Story first published: Wednesday, December 5, 2018, 12:38 [IST]
Other articles published on Dec 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X