న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs ENG: టీ20 తరహాలో చెలరేగిన ఇంగ్లండ్.. ఓటమి అంచున పాకిస్థాన్!

PAK vs ENG: Ben Duckett races to 50 as England make rapid start chasing 167 to win

కరాచీ: పాకిస్థాన్ గడ్డపై ఇంగ్లండ్ జోరు కొనసాగుతోంది. బజ్ బాల్ కాన్సెప్ట్‌తో బెన్ స్టోక్స్ సేన బెంబేలెత్తిస్తోంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న ఇంగ్లండ్.. క్లీన్ స్వీప్‌కు 55 పరుగుల దూరంలో నిలిచింది. కరాచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లోనూ ఇంగ్లండ్.. విజయం దిశగా దూసుకెళ్తోంది. 167 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన బ్రిటీష్ టీమ్.. మూడో రోజు ఆటముగిసే సమయానికి 17 ఓవర్లలో 112 పరుగులు చేసింది. టెస్ట్ ఫార్మాట్‌లో టీ20 తరహా బ్యాటింగ్‌తో చెలరేగుతోంది.

టీ20 తరహా బ్యాటింగ్..

రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బౌలర్లపై విరుచుకుపడిన ఇంగ్లండ్ బ్యాటర్లు కేవలం 5.4 ఓవర్లలోనే 50 పరుగులు .. 13.4 ఓవర్లలోనే సెంచరీ మార్క్ అందుకున్నారు. ఆ జట్టు ఓపెనర్ బెన్ డక్కెట్(38 బంతుల్లో 8 ఫోర్లతో 50 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీ బాదగా.. జాక్ క్రాలీ(41 బంతుల్లో 7 ఫోర్లతో 41) ధాటిగా ఆడాడు. క్రీజులోకి నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన రెహాన్ అహ్మద్, జాక్‌క్రాలీలను అబ్రర్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులో బెన్ డక్కెట్‌తో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్(10 బ్యాటింగ్) ఉన్నారు.

రెచ్చిపోయిన రెహాన్ అహ్మద్

అంతకుముందు 21/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ 74.5 ఓవర్లలో 216 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(104 బంతుల్లో 6 ఫోర్లతో 54), సౌద్ షకీల్(133 బంతుల్లో 6 ఫోర్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ అరంగేట్ర బౌలర్, అండర్ 19 స్టార్ రెహాన్ అహ్మద్(5/48) ఐదు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు. ఈ ఏడాది జనవరిలోనే అండర్ 19 ప్రపంచకప్ ఆడిన రెహాన్ అహ్మద్.. 10 నెలల వ్యవధిలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన పెర్ఫామెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతనికి తోడుగా జాక్ లీచ్ మూడు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు.

విజయం ముంగిట ఇంగ్లండ్..

విజయం ముంగిట ఇంగ్లండ్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులు చేసి 50 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో రెహాన్ ధాటికి పాక్ కుప్పకూలగా.. ఇంగ్లండ్ ముందు 167 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. టీ20 తరహా బ్యాటింగ్‌తో మూడో రోజే విజయ లాంఛనాన్ని పూర్తి చేయాలని ఇంగ్లండ్ భావించినా.. అబ్రర్ అహ్మద్ అడ్డుగా నిలిచాడు. నాలుగో రోజు ఆట తొలి సెషన్‌లోనే ఫలితం తేలనుంది. సొంతగడ్డపై సిరీస్ క్లీన్ స్వీప్ అయిన ఘోర పరాభావాన్ని పాకిస్థాన్ మూటగట్టుకోనుంది.

Story first published: Monday, December 19, 2022, 18:54 [IST]
Other articles published on Dec 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X