న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ, కోహ్లీ కెప్టెన్సీలో అదే తేడా : మాజీ మానసిక కోచ్

Paddy Upton reveals difference between MS Dhoni, Virat Kohli captaincy
Paddy Upton Reveals The Difference Between MS Dhoni & Virat Kohli's Captaincy

ముంబై: భారత జట్టుకు సారథ్యం వహించే విషయంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీల మధ్య తేడా ఉందని భారత్ జట్టు మాజీ మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ తెలిపాడు. ఇద్దరూ విభిన్నమైన సారథులను చెప్పుకొచ్చాడు. 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో టీమిండియాతో కలిసి పనిచేసిన ప్యాడీ ఆప్టన్.. తాజా ఓ ఇంటర్వ్యూలో ఈ ఇద్దరు సారథుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేశాడు.

'మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీల కెప్టెన్సీ చాలా భిన్నంగా ఉంటుంది. ధోనీ స్ట్రాంగ్.. సైలెంట్ టైప్ అయితే.. కోహ్లీ మాత్రం ఎమోషనల్ టైప్. మైదానంలో కోహ్లీ తన హావభావాలను అదుపులో ఉంచుకోలేడు. తన చర్యలతో సహచరుల్లో సైతం ఆ ఉత్సాహాన్ని నింపగలడు. ఇక తన స్ఫూర్తివంతమైన మాటలతోనూ ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టగలుగుతున్నాడు. కెరీర్ ఆరంభంలో బరువు పెరిగిన కోహ్లీ.. ఆ తర్వాత ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించడంతో అతని కెరీర్ మలుపు తిరిగింది' అని ప్యాడీ ఆప్టన్ వెల్లడించాడు.

2014లో ధోనీ నుంచి టెస్టు టీమ్ పగ్గాలు అందుకున్న కోహ్లీ.. ఆ తర్వాత 2017లో పూర్తి స్థాయి బాధత్యలను అందుకున్నాడు. ఇక విరాట్ సారథ్యంలోని భారత జట్టు 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణ తర్వాత టెస్టు సిరీస్‌లో టీమిండియాని విజేతగా నిలిపిన కోహ్లీ.. ఆ ఘనత సాధించి తొలి ఆసియా కెప్టెన్‌గా రికార్డ్‌‌కెక్కాడు.

Story first published: Thursday, April 9, 2020, 19:24 [IST]
Other articles published on Apr 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X