న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

"Our Hero": వింగ్ కమాండర్ అభినందన్ కోసం బీసీసీఐ స్పెషల్ జెర్సీ

BCCI Releases Special Jersey To Welcome IAF Wing Commander | Oneindia Telugu
Our Hero: Virat Kohli, Sania Mirza Salute Abhinandan Varthaman On His Return

హైదరాబాద్: వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థ‌మాన్ తిరిగి స్వదేసానికి చేరారు. పాకిస్థాన్‌కు చిక్కిన భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చినందుకు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. భారత్ యావతావని అభినందన్‌కు ఘనంగా స్వాగతం పలికింది.

'18' నంబర్‌ జెర్సీనే ఎందుకంటే!: కొత్త జెర్సీ ఆవిష్కరణలో కోహ్లీ వెల్లడి'18' నంబర్‌ జెర్సీనే ఎందుకంటే!: కొత్త జెర్సీ ఆవిష్కరణలో కోహ్లీ వెల్లడి

క్రీడాకారులు సైతం అభినందన్‌ ధైర్యసాహసాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పాకిస్థాన్‌కు చిక్కినప్పటి నుంచీ అతడు క్షేమంగా భారత్‌కు రావాలని అందరూ కోరుకున్నారు. శుక్రవారం రాత్రి భారత్‌లోకి అడుగు పెట్టిన ఆ వీర సైనికుడికి విరాట్ కోహ్లీ, సచిన్, సెహ్వాగ్‌, సైనా, గంభీర్‌, లక్ష్మణ్ లాంటి వారు ఘన స్వాగతం పలుకుతూ సోషల్‌ మీడియాలో ట్వీట్లు పెట్టారు.

అభినందన్ పేరిట ప్రత్యేక జెర్సీని విడుదల చేసిన బీసీసీఐ

బీసీసీఐ సైతం భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను బీసీసీఐ తగిన రీతిలో గౌరవించింది. అతను చూపించిన తెగువ, ధైర్య సాహాసాన్ని మెచ్చుకుంటూ అభినందన్ పేరిట ప్రత్యేకంగా జెర్సీని ఆవిష్కరించింది. "గగనాన్ని శాసించావు, మా హృదయాలను గెలుచుకున్నావు. నీ అసమాన పోరాట పటిమ భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకం" అని బీసీసీఐ ట్వీట్ చేసింది.

సచిన్ టెండూల్కర్

"హీరో అంటే కేవలం నాలుగు లెటర్లు మాత్రమే. నీ ధైర్య సాహసాలకు మేమెంతో గర్వపడుతున్నాం, మనం ఎలా ఉండాలో మన హీరో మనకు నేర్పించాడు" అని సచిన్ ట్వీట్ చేశాడు.

విరాట్ కోహ్లీ

"రియల్ హీరో. నేను నీకు నమస్కరిస్తున్నా. జై హింద్" అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్‌

"మీరు మాకున్నందుకు మేమెంతో గర్వపడుతున్నాం! మీ ధైర్య సాహసాల ముందు మేం మోకరిల్లుతున్నాం. స్వాగతం అభినందన్‌. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మిమ్మల్ని చూసి గర్వం పడుతున్నాం" అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

సైనా నెహ్వాల్‌

"మన హీరోకు స్వాగతం" అని సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు.

సురేశ్‌ రైనా

"వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ సమస్త భారత దేశం మీ ధైర్య సాహసాలకు, దేశభక్తికి వందనం చేస్తోంది" అని సురేశ్ రైనా ట్వీట్ చేశాడు.

మహ్మద్‌ కైఫ్‌

"స్వదేశానికి స్వాగతం అభినందన్‌. సంక్లిష్ట పరిస్థితుల్లో మీరు చూపిన ధైర్య సాహసాల పట్ల గర్వపడుతున్నాం. మీరు తిరిగొచ్చినందుకు సంతోషిస్తున్నాం" అని మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు.

రవిచంద్రన్‌ అశ్విన్‌

"నేను ఈ భూమ్మీద జీవిస్తున్న కాలంలో మీ కన్నా పెద్ద హీరోను చూడలేదు. అభినందన్‌కు స్వాగతం" అని రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ చేశాడు.

గౌతమ్‌ గంభీర్‌

"ఆయన తిరిగొచ్చే ముందు నేనెంతో ఆందోళన పడ్డాను. భరతమాత తన బిడ్డను మళ్లీ పొందినందుకు సంతోషిస్తున్నా" అని గంభీర్ ట్వీట్ చేశాడు.

Story first published: Saturday, March 2, 2019, 11:23 [IST]
Other articles published on Mar 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X