న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లో అరుదైన షాట్.. బ్యాట్‌ను వెనక్కితిప్పి కొడితే సిక్సర్‌ (వీడియో)!!

New Zealand Cricketer Hits Outrageous Shot ! || Oneindia Telugu
Otago vs Auckland: New Zealand cricketer Glenn Phillips hits outrageous shot

ఆక్లాండ్‌: ఒకప్పుడు కొత్త తరహాలో బ్యాట్స్‌మన్‌ షాట్ ఆడితే చాలా కాలం వరకు దాని గురించే చెప్పుకునేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. దీనికి ప్రధాన కారణం టీ20 క్రికెట్. బ్యాట్స్‌మన్‌ టీ20 క్రికెట్‌లో వేగంగా పరుగులు చేయాలని రకరకాల వైవిధ్య, కొత్త షాట్లు ఆడుతున్నారు. టీ20 క్రికెట్‌కు అలవాటు పడడంతో.. టెస్ట్, వన్డేలను కూడా అదే తరహాలో ఆడేస్తున్నారు. ఎలా ఆడినా కానీ.. బ్యాట్స్‌మన్‌ వైవిధ్య షాట్లతో అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా మరో కొత్త షాట్ తెరపైకి వచ్చింది.

కుల్‌దీప్‌కు ఐపీఎల్‌ 2020 ఎంతో కీలకం.. రాణిస్తేనే టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు!!కుల్‌దీప్‌కు ఐపీఎల్‌ 2020 ఎంతో కీలకం.. రాణిస్తేనే టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు!!

బ్యాట్‌ను వెనక్కితిప్పి కొట్టిన ఫిలిఫ్స్‌:

ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఫోర్డ్‌ ట్రోఫీ జరుగుతోంది. ఈ ట్రోఫీలో భాగంగా ఆక్లాండ్‌, ఒటాగో జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. న్యూజిలాండ్‌ క్రికెటర్‌ గ్లెన్‌ ఫిలిఫ్స్‌.. ఆక్లాండ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఒటాగోతో బౌలర్ బంతిని విసరగా.. ఫిలిఫ్స్‌ విన్నూత రీతిలో బ్యాట్‌ను వెనక్కితిప్పి ఆ బంతిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో బౌలర్ అసహనానికి గురయ్యాడు.

ఐసీసీ కూడా ఫిదా:

ఐసీసీ కూడా ఫిదా:

ఫిలిఫ్స్‌ ఆడిన షాట్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. గతంలో ఎందరో ఎలాంటి షాట్ ఆడినా.. ఇది కొంచెం కొత్తగా ఉంది. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు 'మిస్టర్ 360' కూడా ఇలాంటి షాట్ ఆడాడు. ఫిలిఫ్స్‌ షాట్‌కు ఐసీసీ కూడా ఫిదా అయింది. ఈ వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఈ షాట్‌ పేరేంటో చెప్పాలని ట్వీట్‌ చేసింది.

క్రికెట్‌లో అరుదైన షాట్:

క్రికెట్‌లో అరుదైన షాట్:

ఈ షాట్‌పై అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు. ఫన్నీ కామెంట్లు, లైకులు చేస్తున్నారు. ఓ అభిమాని 'క్రికెట్‌లో అరుదైన షాట్' అని కామెంట్ చేయగా.. 'అజిత్‌ పవార్‌ షాట్‌' అని మరో అభిమాని కామెంట్ చేసాడు. ఐపీఎల్ ప్రాంచైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ (ఆర్ఆర్) కూడా దీనిపై స్పందించింది. 'స్విచ్‌ పుల్‌?. రివర్స్‌ పుల్‌?. అసాధారణమైన షాట్‌ ఇది' అని కామెంట్‌ చేసింది.

97 పరుగులతో విజయం:

97 పరుగులతో విజయం:

ఈ మ్యాచ్‌లో ఒటాగోపై ఆక్లాండ్‌ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆక్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిఫ్స్‌ (156, 135 బంతుల్లో 16×4, 3×6), మార్టిన్‌ గప్తిల్ (117, 130 బంతుల్లో 7×4, 3×6) సెంచరీలు చేశారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఒటాగో 213 పరుగులకే ఆలౌట్ అయింది. నీల్ బ్రూమ్ (66), మిచ్ రెన్విక్ (31) మాత్రమే రాణించారు.

Story first published: Friday, November 29, 2019, 14:28 [IST]
Other articles published on Nov 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X