న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Test Championship: టాప్‌కు దూసుకెళ్లిన ఇంగ్లండ్‌.. నాలుగులో భారత్! కోహ్లీసేన ఫైనల్ చేరాలంటే?

One More England Win Could Knock Team India Out Of World Test Championship Final

చెన్నై: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో చెన్నై చెపాక్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. 420 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. జేమ్స్ అండర్సర్‌ 3/17, జాక్ లీచ్‌ 4/76‌ దెబ్బకు రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌ 227 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి టెస్ట్ సిరీస్‌లో బోణి కొట్టింది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించడం ద్వారా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఒక్క ఓట‌మి టీమిండియాను దారుణంగా దెబ్బ తీసింది. టాప్ ప్లేస్‌లో ఉన్న భారత్.. ఈ ఓట‌మితో ఏకంగా నాలుగో స్థానానికి ప‌డిపోయేలా చేసింది.

టాప్ ప్లేస్‌లో ఇంగ్లండ్‌

టాప్ ప్లేస్‌లో ఇంగ్లండ్‌

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మంగళవారం చెన్నై చెపాక్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ తొలి టెస్ట్ ముగిసిన త‌ర్వాత వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ టేబుల్‌లో స్థానాలు ఒక్కసారిగా తారుమార‌య్యాయి. ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది. ఈ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగా ఆరో సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్‌.. 11 విజ‌యాలు, 4 ఓట‌ములు, 3 డ్రాల‌తో మొత్తం 70.2 శాతం ప‌ర్సెంటేజీ పాయింట్ల‌తో అగ్ర స్థానంలో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ టెస్టు చాంపియన్‌షిప్‌లో టాప్‌లో ఉన్న భారత్.. ఏకంగా నాలుగో స్థానానికి దిగ‌జారింది.

నాలుగులో భారత్

నాలుగులో భారత్

టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆరో సిరీస్ ఆడుతున్న భారత్.. 9 గెలిచి, 4 ఓడి, ఒక‌టి డ్రా చేసుకుంది. మొత్తం 68.3 శాతం ప‌ర్సెంటేజీ పాయింట్ల‌తో నాలుగో స్థానంలో ఉంది. రెండు, మూడు స్థానాల్లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌ వాయిదా పడడంతో వరల్డ్‌ టెస‍్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా న్యూజిలాండ్‌ నిలిచిన సంగతి తెలిసిందే. ఏదిఏమైనా న్యూజిలాండ్‌ ఫైనల్ ఆడుతుంది. రెండో అత్తానం కోసమే ఇప్పుడు రసవత్తర పోరు ఉంది.

పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి

పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి

వాస్తవానికి ఇంగ్లండ్‌తో సిరీస్ ప్రారంభ‌మ‌య్యే ముందు వరల్డ్‌ టెస‍్టు చాంపియన్‌షిప్ ఫైన‌ల్‌కు క్వాలిఫై అవ‌డం టీమిండియాకు పెద్ద క‌ష్టం కాదేమో అనుకున్నారు. ఆస్ట్రేలియాపై గెలిచిన ఉత్సాహం, సొంత‌గ‌డ్డ‌పై ఆడుతున్నామ‌న్న ఊపులో ఇంగ్లండ్‌పై గెలిచి సునాయాసంగా కోహ్లీసేన క్వాలిఫై అవుతుంద‌ని ఇటు అభిమానులు, అటు విశ్లేష‌కులు కూడా భావించారు. కానీ అనూహ్యంగా తొలి టెస్ట్‌లోనే టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అస‌లు టీమిండియా ఇప్పుడు చాంపియన్‌షిప్ ఫైన‌ల్‌కు క్వాలిఫై అవుతుందా లేదా అన్న అనుమానం నెలకొంది.

2-1 లేదా 3-1తో

2-1 లేదా 3-1తో

టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓడినప్పటికి టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలు ఇంకా ఉన్నాయి. అయితే అది జ‌ర‌గాలంటే.. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ మ‌రో మ్యాచ్ గెల‌వ‌కుండా చూడ‌టంతో పాటు టీమిండియా క‌నీసం 2-1 లేదా 3-1తో సిరీస్ గెల‌వాలి. ఇంగ్లండ్ క‌నీసం మూడు మ్యాచ్‌లు గెలిస్తే.. ఫైన‌ల్ దూసుకెళుతుంది. ఒక‌వేళ ఇంగ్లండ్ 3 కాకుండా అంత‌క‌న్నా త‌క్కువ తేడా‌తో సిరీస్ గెలిచినా లేదా డ్రా చేసుకున్నా.. ఆస్ట్రేలియా వెళ్తుంది. లార్డ్స్‌ వేదికగా జూన్‌లో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది.

India vs England: అంపైర్ ఔటివ్వకముందే.. మైదానం వీడిన వాషింగ్టన్ సుందర్!!

Story first published: Tuesday, February 9, 2021, 15:55 [IST]
Other articles published on Feb 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X