న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

On This Day: 1996లో కివీస్ జట్టు మొత్తానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్

On This Day: When the whole New Zealand team was awarded the Man of the Match in 1996

హైదరాబాద్: మనందరికీ తెలుసు క్రికెట్ అనేది టీమ్ గేమ్. క్రికెట్‌లో ప్రతి ఒక్కరు రాణిస్తేనే ఆ జట్టు విజయాన్ని అందుకుంటుంది. మ్యాచ్‌లో జట్టు గెలిచినా ఓడినా అందరూ సమాన బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే, 23 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున... 1996 ఏప్రిల్‌ 3న జట్టు మొత్తానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. వెస్టిండీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని న్యూజిలాండ్‌ జట్టు గెలుచుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఐదు వన్డేల సిరిస్

ఐదు వన్డేల సిరిస్

ఐదు వన్డేల సిరిస్ ఆడేందుకు గాను కరేబియన్ పర్యటనకు న్యూజిలాండ్ జట్టు వెళ్లింది. ఈ సిరిస్‌లో మూడు వన్డేలు ముగిసే సరికి ఆతిథ్య వెస్టిండిస్ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. అయితే సిరీస్‌లో ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే పర్యాటక జట్టు అయిన న్యూజిలాండ్‌ నాలుగో వన్డేలో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి తలెత్తింది.

158 పరుగులకే ఆలౌట్

158 పరుగులకే ఆలౌట్

అయితే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు వెస్టిండిస్ బౌలర్ల దెబ్బకు గాను కేవలం 158 పరుగులకే ఆలౌటైంది. అప్పట్లో వెస్టిండిస్ జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్‌ లైనప్‌‌ను కలిగి ఉంది. దీంతో అందరూ వెస్టిండీస్‌ జట్టే గెలుస్తుందని ఓ అంచనాకు వచ్చారు.

ఒకానొక దశలో 104/4

ఒకానొక దశలో 104/4

చేధనకు దిగిన వెస్టిండిస్ జట్టు ఒకానొక దశలో 104/4 పటిష్ట స్థితిలో నిలిచింది. వెస్టిండిస్ విజయానికి 55 పరుగులు అవసరమైన దశలో చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. అయితే, ఈ సమయంలో కివీస్‌ బౌలర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో ఆతిథ్య జట్టు 120 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

క్రమం తప్పకుండా వికెట్లు తీసిన కివీస్ బౌలర్లు

క్రమం తప్పకుండా వికెట్లు తీసిన కివీస్ బౌలర్లు

ఆ తర్వాత క్రమం తప్పకుండా కివీస్ బౌలర్లు వికెట్లు తీసి న్యూజిలాండ్ జట్టుని గెలిపించారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ లీ జెర్మన్ ఆరుగురు బౌలర్లను ప్రయోగించగా అందరూ సమానంగా వికెట్లు తీశారు. దీంతో జట్టు సమిష్టి కృషికి గాను ఐసీసీ ఆ మ్యాచ్‌లో న్యూజిలాంట్‌ జట్టు మొత్తాన్ని మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ప్రకటించింది.

Story first published: Wednesday, April 3, 2019, 15:46 [IST]
Other articles published on Apr 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X