న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మురళీ విజయ్ హీరోచిత ఇన్నింగ్స్.. టైటిల్ నెగ్గిన సీఎస్‌కే!!

On this day in 2011, Murali Vijay’s brilliance helps CSK win 2nd IPL crown

హైదరాబాద్: టీమిండియా వెటరన్ ఓపెనర్ మురళీ విజయ్ టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిపోయిన విషయం తెలిసిందే. గతంలో వన్డే, టీ20ల్లో అవకాశం ఇచ్చినా నిరూపించుకోలేకపోయాడు. ఇక 2018 ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన విజయ్ వేటుకి గురయ్యాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోవడంతో మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. అయితే ఓ టీ20 మ్యాచ్‌లో భీకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. ఆ హీరోచిత ఇన్నింగ్స్‌కు నేటికి తొమ్మిదేళ్లు.

అందరం ఆశావాదులమే.. ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుంది: కుంబ్లేఅందరం ఆశావాదులమే.. ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుంది: కుంబ్లే

ఐపీఎల్‌- 2011లో భాగంగా చెన్నై సూపర్ ‌కింగ్స్‌-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ పోరులో మురళీ విజయ్‌ హీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో​ 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 95 పరుగులు చేసాడు. దీంతో చెన్నై భారీ స్కోర్ చేసింది. ఇక టాప్‌ స్కోరర్‌గా నిలిచిన విజయ్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్'‌ అవార్డు కూడా అందుకున్నాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌గా సీఎస్‌కే, గ్రూప్‌ స్టేజ్‌లో అత్యధిక పాయింట్లతో ఉన్న ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన ఆ ఫైనల్‌ పోరు ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

టాస్‌ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా మైక్‌ హస్సీ, మురళీ విజయ్‌లు మైదానంలోకి వచ్చారు. ఈ జోడి ఆదినుంచే బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. విజయ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతుండడంతో.. మరోవైపు తానేమీ తక్కువ కాదని హస్సీ కూడా విరుచుపడ్డాడు. విజయ్, హస్సీ (63; 45 బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 159 పరుగుల భారీ భాగస్వామాన్ని నమోదు చేశారు. అనంతరం మరింత దూకుడుగా ఆడిన విజయ్ ‌(95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆపై మిగతా బ్యాట్స్‌మన్‌ కూడా మెరుపులు మెరిపించడంతో సీఎస్‌కే నిర్ణీత ఓవ​ర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అందరి ఆశలను ఆవిరి చేస్తూ డకౌట్‌గా వెనుదిరిగాడు. గేల్‌ను సిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బోల్తా కొట్టించాడు. స్టార్ ఆటగాళ్లు అందరూ విఫలమయ్యారు. సౌరభ్‌ తివారి (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేసాడు. దీంతో డానియల్‌ వెటోరీ సారథ్యంలోని ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో 58 పరుగుల భారీ విజయం సాధించిన సీఎస్‌కే ఐపీఎల్‌-2011 ట్రోఫీని గెలుచుకుంది. మ్యాచ్‌ అనంతరం మీడియా సమావేశంలో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ మురళీ విజయ్‌ హీరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడని కొనియాడాడు.

ఆ మధ్య చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. లైవ్ సెషన్ సందర్భంగా ఏ క్రికెటర్‌తో డిన్నర్ చేయాలని ఉందని ఓ అభిమాని ప్రశ్నించగా... 'ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లిస్ పెర్రీతో డిన్నర్ చేయాలనుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఇక ఎప్పుడైన శిఖర్ ధావన్‌తో ఒకే' అని విజయ్ సమాధానమిచ్చాడు. విజయ్ కోరికను, డిన్నర్ ప్రపోజల్‌ను పెర్రీ ముందుంచగా... 'ఆ డిన్నర్ బిల్ విజయ్ చెల్లిస్తాడనుకుంటున్నా. అతనేం వెనుకాడే మనిషి కాదు. అతడు డిన్నర్ చేస్తే ఉబ్బితబ్బిబ్బవుతా' అని పేర్కొంది.

Story first published: Thursday, May 28, 2020, 15:28 [IST]
Other articles published on May 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X