న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL: యూసఫ్ పఠాన్ మెరుపులు.. డబుల్ ఆర్ సంబరాలు.. ఆ అద్బుతానికి అప్పుడే 13 ఏళ్లు!

On this day in 2008: Rajasthan Royals defeat CSK to win maiden IPL title

హైదరాబాద్: సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజు రాజస్థాన్ రాయల్స్ (RR) అద్బుత విజయాన్నందుకుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్.. అరంగేట్ర సీజన్‌లోనే క్రికెట్ బ్యాడ్ బాయ్ షేన్ వార్న్ సూపర్ కెప్టెన్సీతో రాజసంగా టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫైనల్లో పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్‌‌ను మట్టికరిపించి చాంపియన్‌గా నిలిచింది. ఓ వైపు ధోనీ, రైనా మెరుపులు.. మరోవైపు యూసఫ్ పఠాన్ ఆల్‌రౌండ్ షో.. మొత్తానికి ఆఖరి బంతి వరకు నవ్వా-నేనా అన్నట్లు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌‌లో డబుల్ ఆర్.. ముచ్చటగా మూడు వికెట్లతో విజయాన్నందుకుంది. అప్పుడే ధనాధన్ ఫార్మాట్ రుచి చూసిన అభిమానులు.. రాజస్థాన్ థ్రిల్లింగ్ విజయంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆసాంతం అభిమానులను కనువిందు చేసిన ఈ మ్యాచ్‌‌ను గుర్తు చేసుకుందాం.

చెలరేగిన ధోనీ, రైనా..

చెలరేగిన ధోనీ, రైనా..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఆ జట్టు ఆదిలోనే ఓపెనర్ శివరామకృష్ణన్(16) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ పార్థీవ్ పటేల్(38)తో జత కలిసిన సురేశ్ రైనా దుమ్మురేపాడు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. కానీ రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సీఎస్‌కే వరుస విరామాల్లో పార్థీవ్, అల్బీ మోర్కెల్(16), సురేశ్ రైనా(43) వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ధోనీ(17 బంతుల్లో 27) ధాటిగా ఆడటంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. యూసఫ్ పఠాన్ మూడు వికెట్లతో చెన్నై పతనాన్ని శాసించాడు.

యూసఫ్ మెరుపులు..

యూసఫ్ మెరుపులు..

అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కూడా వరుసగా వికెట్లు కోల్పోయింది. నిరజ్ పటేల్(2), స్వప్నిల్(28), కమ్రాన్ అక్మల్(6), షేన్ వాట్సన్(28) నిరాశపరిచారు. ఈ పరిస్థితుల్లో యూసఫ్ పఠాన్(39 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్‌లతో 56) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. హిట్టింగే లక్ష్యంగా చెన్నై బౌలర్లను ఆడుకున్నాడు. విజయానికి చెరువైన క్రమంలో యూసఫ్.. రైనా సూపర్ ఫీల్డింగ్‌కు రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో చెన్నై శిభిరంలో ఆశలు చిగురించాయి. కానీ అధిగమించాల్సిన రన్ రేట్ తక్కువగా ఉండటంతో కెప్టెన్ షేన్ వార్న్(9 నాటౌట్), సోహైల్ తన్వీర్(9 నాటౌట్) ఆచితూచి ఆడుతూ ఆఖరి బంతికి విజయాన్నందించారు. దాంతో డబుల్ ఆర్ చాంపియన్‌గా నిలిచింది. ఆల్‌రౌండ్ షోతో రాణించిన యూసఫ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

మరిచిపోలేని మధుర క్షణాలు..

ఈ అద్భుత విజయానికి నేటితో 13 ఏళ్లు పూర్తవ్వడంతో రాజస్థాన్ రాయల్స్‌తో పాటు యూసఫ్ పఠాన్ నాటి మధుర క్షణాలను గుర్తు చేసుకున్నాడు. 'టైమ్ అలా గడిచిపోతుంది. 13 ఏళ్ల కిత్రం ఇదే రోజు రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్ర ఐపీఎల్ సీజన్ టైటిల్ గెలిచాం. నాటి మా కెప్టెన్, మెంటార్ షేన్ వార్న్ చెప్పిన స్పూర్తిదాయకమైన మాటలు ఇంకా గుర్తున్నాయి. ఫైనల్లో నా అద్భుత ప్రదర్శన నా గుండెల్లో అలానే నిలిచిపోయింది. ఆ సీజన్‌లోని మా కోర్ టీమ్ అంటే నాకు చాలా ఇష్టం'అని యూసఫ్ పఠాన్ నాటి క్షణాలను నెమరవేసుకున్నాడు. ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన సందర్భమని రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది.

Story first published: Tuesday, June 1, 2021, 15:27 [IST]
Other articles published on Jun 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X