న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులు.. లారా రికార్డుకు 26ఏళ్లు!!

On this day, Brian Lara smashed highest first class individual score in 1994

హైదరాబాద్: లెజండరీ క్రికెటర్‌, వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్ బ్రయన్‌ లారా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమాకాలీన క్రికెట్‌లో భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు ధీటుగా పరుగులు సాధించిన వారిలో ఒకడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టుల్లో క్వాడ్రపుల్‌ సెంచరీ (400*నాటౌట్‌) సాధించిన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా బ్రేక్‌ చేయలేకపోయాడు. అలాంటి లారా తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లోనూ ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధించాడు.

ధోనీ మళ్లీ క్రికెట్ ఆడటం చాలా కష్టం.. కానీ నిర్ణయం అతనిదే: మాజీ చీఫ్ సెలక్టర్ధోనీ మళ్లీ క్రికెట్ ఆడటం చాలా కష్టం.. కానీ నిర్ణయం అతనిదే: మాజీ చీఫ్ సెలక్టర్

ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులు:

ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులు:

బ్రయన్‌ లారా ఒక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులు సాధించి క్రికెట్‌ చరిత్రలో తన పేరును ప్రత్యేకంగా లిఖించుకున్నాడు. అదే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఈ అద్భుతం జరిగి ఈ రోజుకి 26 ఏళ్లవుతుంది. 1994 జూన్‌ 6న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా లారా(501*) వార్విక్‌షైర్‌ జట్టు తరఫున ఆడుతూ దర్హమ్‌ జట్టుపై ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు నెలకొల్పాడు. ఇది ప్రపంచ క్రికెట్‌లోనే అరుదైన ఘనత. అంతకుముందు పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ హనీఫ్‌ మహ్మద్‌ (499) కరాచీ జట్టు తరఫున 1959లో బహవాల్పూర్‌ జట్టుపై అత్యధిక పరుగులు సాధించాడు. లారా.. హనీఫ్‌ రికార్డును వెనక్కినెట్టాడు.

62 ఫోర్లు, 10 సిక్సులు:

62 ఫోర్లు, 10 సిక్సులు:

మొత్తం 474 నిమిషాల పాటు క్రీజులో ఉన్న బ్రయన్‌ లారా 427 బంతులెదుర్కొని 501 పరుగులు చేశాడు. అయితే లెజండరీ క్రికెటర్‌ 20 పరుగుల లోపే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 12 పరుగుల వద్ద ఉండగా అతడు బౌల్డ్‌ అయిన బంతి నోబాల్‌గా నమోదవ్వగా.. 18 పరుగుల వద్ద అతడిచ్చిన క్యాచ్‌ను వికెట్‌ కీపర్‌ క్రిస్‌స్కాట్‌ నేలపాలు చేసాడు. దీంతో రెండుసార్లు లైఫ్‌ దొరికిన తర్వాత లారా రెచ్చిపోయి 501 పరుగులు బాదేశాడు. 62 ఫోర్లు, 10 సిక్సులతో మైదానంను హోరెత్తించాడు.

ఇంగ్లాండ్‌పై 375 పరుగుల రికార్డు:

ఇంగ్లాండ్‌పై 375 పరుగుల రికార్డు:

ఆంటిగ్వాలో ఇంగ్లాండ్‌పై 375 పరుగుల రికార్డును నమోదు చేసిన రెండు నెలలకే ఈ మైలురాయి (501 పరుగులు) అందుకున్నాడు. ఆ సీజన్‌లో మొత్తం 2006 పరుగులు చేసిన విండీస్‌ మాజీ కెప్టెన్ లారా 89.82 సగటుతో 8 మ్యాచ్‌ల్లో ఏడు శతకాలు సాధించాడు. దీంతో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా మరో రికార్డు నెలకొల్పాడు. లారా 131 టెస్టుల్లో 11,953 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 48 అర్థ శతకాలు ఉన్నాయి. 299 వన్డేల్లో 10,405 పరుగులు చేసిన లారా.. 261 ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 22,156 పరుగులు సాధించాడు. ఇందులో 65 శతకాలు, 88 అర్థసెంచరీలు ఉన్నాయి.

Story first published: Saturday, June 6, 2020, 20:22 [IST]
Other articles published on Jun 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X