న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యూపీ బోర్డ్ అడ్మిట్ కార్డుపై అర్జున్ టెండూల్కర్!(ఫొటో)

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ విద్యా మండలి ఉన్నత విద్య పరీక్షల కోసం జారీ చేసిన ఓ అడ్మిట్ కార్డుపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఫొటో ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

ఆగ్రాలోని ఇంటర్ కాలేజీ విద్యార్థికి సంబంధించి బోర్డు ఓ అడ్మిట్ కార్డును జారీ చేసింది. ఆ అడ్మిట్ కార్డ్ నెంబర్ 0025488 కాగా, దానిపై సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఫొటో ఉంది. పుట్టిన తేదీ 10/06/1996 అని ఉండగా, దానిపై విద్యార్థి పేరు అర్జున్ సింగ్ అని ఉంది.

OMG! Sachin Tendulkar's son Arjun's photo on admit card issued to UP Board student

కాగా, అర్జున్ సింగ్ తల్లిదండ్రులు శ్రీమతి దేవి, రాంనివాస్‌ల పేర్లు కూడా అందులో పేర్కొనబడ్డాయి. అంకుర్ ఇంటర్ కాలేజీకి సంబంధించిన అధికారులు అర్జున్ టెండూల్కర్ ఫొటో ఉన్న ఆ కార్డుపై సంతకాలు కూడా చేయడం గమనార్హం.

కాగా, రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ కాలేజీలో విద్యా మాఫీయా జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్డు మీద ఒక ఫొటో ఉంటుందని, మరొకరు వచ్చి పరీక్ష రాయడంతో అతడు పాస్ అవుతాడని చెబుతున్నారు.

పాక్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఫొటో పెట్టినా కూడా అక్కడ ఎవరూ తనిఖీ చేయరని, విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఆరోపణలు ఎక్కువ కావడంతో ప్రభుత్వం విద్యా మాఫీయాపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X