న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అగ్రస్థానం పాక్‌దే అయినా ఆధిపత్యం మాత్రం టీమిండియాదే!

Team India Dominance In T20Is Despite Pak’s Number 1 Ranking | Oneindia Telugu
Numbers reveal Indias dominance in T20Is despite Pakistans number 1 ranking

హైదరాబాద్: చెన్నై వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో పర్యాటక వెస్టిండిస్ జట్టు ఆరు వికెట్ల తేడాతో టీమిండియా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో టీ20ల్లో తన విజయాల సంఖ్యను భారత జట్టు మరింతగా పెంచుకుంది.

 రెండో స్థానంలో టీమిండియా

రెండో స్థానంలో టీమిండియా

తద్వారా టీ20 సిరీస్‌ను అత్యధిక సార్లు గెలిచిన జాబితాలో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. టీమిండియా మూడుసార్లు 3-0తో టీ20 సిరీస్‌ను గెలవగా, పాక్ ఐదుసార్లు విజయం సాధించింది. అప్ఘానిస్తాన్‌తో కలిసి భారత్‌ సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది.

68 మ్యాచ్‌ల్లో విజయం

68 మ్యాచ్‌ల్లో విజయం

ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, న్యూజిలాండ్‌, యూఏఈ, వెస్టిండీస్‌లు ఒక్కోసారి మాత్రమే 3-0తో టీ20 సిరీస్‌లను గెలిచాయి. దీంతో పాటు టీ20 విజయాల శాతంలో పాకిస్థాన్‌ను వెనక్కునెట్టిన భారత్‌ రెండో అత్యుత్తమ జట్టుగా నిలిచింది. టీమిండియా 2006 నుంచి 107 టీ20లు ఆడింది. అందులో 68 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది.

36 మ్యాచ్‌ల్లో ఓటమి

36 మ్యాచ్‌ల్లో ఓటమి

మరో 36 మ్యాచ్‌ల్లో ఓటమి చూడగా, ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. దీంతో టీమిండియా విజయాల శాతం 65.23గా నమోదైంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ను అధిగమించింది టీమిండియా. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న పాక్‌ విజయాల శాతం 65.10గా ఉంది.

పాక్‌ను అధిగమించిన టీమిండియా

పాక్‌ను అధిగమించిన టీమిండియా

చెన్నై వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో పాక్‌ను అధిగమించింది. ప్రస్తుతం టీ20 ర్యాంకుల్లో పాకిస్థాన్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే, ఈ మధ్య కాలంలో టీమిండియా వరుసగా సాధిస్తున్న విజయాలు జట్టు నిలకడను చూపిస్తోంది. అయితే, టీ20ల్లో అందరికన్నా ఎక్కువ విజయాల శాతం 67.24 మాత్రం అప్ఘన్‌దే కావడం విశేషం.

Story first published: Monday, November 12, 2018, 19:02 [IST]
Other articles published on Nov 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X