నోటికి పనిచెప్పిన గాబ్రియల్: ‘గే’ గా ఉండటం వల్ల తప్పేంటన్న జో రూట్!


హైదరాబాద్: గ్రాస్ ఐలెట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో జో రూట్-షానన్ గాబ్రియల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్-జో డెన్లీలు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విండీస్ పేసర్ షనాన్ గాబ్రియల్ తన నోటికి పని చెప్పాడు. ఈ క్రమంలోనే జో రూట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆన్ ఫీల్డ్ అంఫైర్లు వెస్టిండిస్ బౌలర్ గాబ్రియల్‌కు వార్నింగ్ ఇచ్చారు.

సోమవారం మధ్యాహ్నాం సెషన్‌లో
సోమవారం మధ్యాహ్నాం సెషన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే, గాబ్రియల్ చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో స్పష్టత లేకపోయినప్పటికీ, జో రూట్ మాత్రం ‘గే' గా ఉండటం వల్ల తప్పేంటి? అనే సమాధానం ఇవ్వడం మాత్రం మైక్‌లో రికార్డు అయ్యింది.

జో రూట్ మాట్లాడుతూ
దీనిపై మ్యాచ్ అనంతరం జో రూట్ మాట్లాడుతూ "గాబ‍్రియల్ చేసిన వ్యాఖ్యలు తప్పని అనిపిస్తే, అతనే క్షమాపణలు కోరాలి. పలు సందర్బాల్లో ఆన్‌ఫీల్డ్‌లో మాటల యుద్ధం అనేది సహజం. కానీ వారు ఏదైతే వ్యాఖ్యానించారో దానికి కట్టుబడి ఉండాలి. అదే సమయంలో క్షమించమని కోరే తత్వం కూడా ఉండాలి" అని తెలిపాడు.

రిపోర్ట్ చేయని జో రూట్
గాబ్రియల్ అనుచిత వ్యాఖ్యలపై జో రూట్‌పై థర్డ్ అంఫైర్‌కు ఎటువంటి రిపోర్ట్ చేయలేదు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఇప్పటికే వెస్టిండిస్ 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కనీసం మూడో టెస్టులోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని ఇంగ్లాండ్ తాపత్రయపడుతోంది.

తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే ఆలౌట్
ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే ఆలౌటైంది. పేసర్ మార్క్ వుడ్ (5/41) కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్లతో చెలరేగగా, స్పిన్నర్ మొయిన్ అలీ 4 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications