న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌లో భారత్‌ను ఓడించడం ఎంతో కఠినం: మూడు వన్డేల సిరిస్‌పై లబుషేన్

Nothing tougher than playing India in India: Marnus Labuschagne

హైదరాబాద్: క్రికెట్ అసైన్మెంట్‌ను పూర్తి చేయడానికి భారత్ క్లిష్టమైన ప్రదేశమని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ లబుషేన్ అన్నాడు. అంతేకాదు భారత్‌లో భారత్‌ను ఓడించడం ఎంతో కఠినమని కూడా చెప్పుకొచ్చాడు. 25 ఏళ్ల లబుషేన్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమైన తర్వాత తొలి కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందాడు.

అంతేకాదు ఆడిన ఐదు టెస్టుల్లో నాలుగు సెంచరీలు సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉండటం విశేషం. సిడ్నీ వేదికగా సోమవారంతో ముగిసిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 279 పరుగుల తేడాతో విజయం సాధించడంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

ఆస్ట్రేలియా తన సిరిస్‌లో భాగంగా జనవరిలో భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టుతో మూడు వన్డేల సిరిస్ ఆడనుంది. జనవరి 14న ముంబైలో ప్రారంభమయ్యే ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్న లబుషేన్ కఠినమైన పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు.

<strong>చేతిలో బ్యాట్ పెట్టేసి వెళ్లాడు: బుల్లి ఫ్యాన్‌ని ఆశ్చర్యానికి లోను చేసిన వార్నర్ (వీడియో)</strong>చేతిలో బ్యాట్ పెట్టేసి వెళ్లాడు: బుల్లి ఫ్యాన్‌ని ఆశ్చర్యానికి లోను చేసిన వార్నర్ (వీడియో)

భారత్‌లో సిరీస్‌ అంటేనే ఓ సవాలే

భారత్‌లో సిరీస్‌ అంటేనే ఓ సవాలే

"భారత్‌లో సిరీస్‌ అంటేనే ఓ సవాలే. ఎందుకంటే వారు బలమైన ప్రత్యర్థులు. టీమిండియాలో గొప్ప బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఉన్నారు. జనవరిలో జరగనున్న వన్డే సిరీస్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఒక ప్లేయర్‌గా నీ ఆట ఏ స్థాయి ఉందో తెలుసుకోవాలంటే కఠిన పరిస్థితుల్లో బలమైన ప్రత్యర్థితో ఆడాలి. భారత్‌లో భారత్‌‌ను మించిన మరో కఠినమైన ప్రత్యర్ధి ఎవరూ ఉండరు" అని అన్నాడు.

14 టెస్టులు మాత్రమే ఆడిన లబుషేన్

14 టెస్టులు మాత్రమే ఆడిన లబుషేన్

ఇప్పటివరకు కేవలం 14 టెస్టులు మాత్రమే ఆడిన లబుషేన్ ఐసీసీ ఇటీవల ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో అతడిని మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌లతో పోలుస్తున్నారు. దీనిపై లబుషేన్ సైతం స్పందించాడు.

కోహ్లీ, స్మిత్‌లతో పోలికపై

కోహ్లీ, స్మిత్‌లతో పోలికపై

"అందరూ గొప్పగా ఆడుతున్నానని విరాట్‌ కోహ్లీ, కేన్ విలియమ్సనన్‌, స్టీవ్‌ స్మిత్‌తో పోలుస్తున్నారు. వారు 6-7 ఏళ్ల నుంచి ఎంతో నిలకడగా ఆడుతున్నారు. నేను ఈ వేసవిలో మాత్రమే ఆడాను. దీనికే గొప్ప బ్యాట్స్‌మన్‌గా మారిపోను. ప్రస్తుతం నా దృష్టంతా నిలకడగా రాణిస్తూ జట్టుకు విజయాలు అందించడమే" అని అన్నాడు.

అవకాశం వస్తే చాలా బాగుంటుంది

అవకాశం వస్తే చాలా బాగుంటుంది

"నాకు అవకాశం వస్తే చాలా బాగుంటుంది. అదృష్టవశాత్తూ ఎంతో అనుభవం ఉన్న ఆరోన్ ఫించ్‌, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌ నుంచి నేర్చుకుంటున్నాను. వాళ్లకు ఐపీఎల్‌, భారత పర్యటనల అనుభవం ఉంది. ఎస్‌సీజీ నుంచి నేరుగా భారత పర్యటనకు వెళ్లడం ఓ మంచి సన్నాహాకమే. స్పిన్నింగ్ పరిస్థితులకు ఇది ఆస్ట్రేలియాలో మనకు దగ్గరగా ఉంటుంది. కానీ ఫార్మాట్ మార్పుతో వికెట్లు భిన్నంగా ఉంటాయి" అని అన్నాడు. ఆస్ట్రేలియా తరుఫున ఇప్పటివరకు 14 టెస్టులు ఆడిన లబుషేన్ 63.43 యావరేజితో 1,459 పరుగులు చేశారు.

Story first published: Tuesday, January 7, 2020, 15:46 [IST]
Other articles published on Jan 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X