న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌ను వాయిదా వేయాలని ముందే చెప్పా.. వింటేగా! మనుషుల ప్రాణాలు కాపాడటం కన్నా మరేదీ ముఖ్యం కాదు!

Nothing more important than saving lives: Shoaib Akhtar reacts on IPL 2021 suspeneded

కరాచీ: ప్రాణాల కన్నా మరేదీ ముఖ్యం కాదని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021ను వాయిదా వేయాలని రెండు వారాల క్రితమే తాను సూచించానని పేర్కొన్నాడు. ఐపీఎల్ 14వ సీజన్ మధ్యలోనే ఆగిపోతుందని తనకు ముందే తెలుసన్నాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. అక్తర్‌ పాక్‌ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు.

IPL 2021: ఇంగ్లండ్‌ మహిళ క్రికెటర్‌కు సీఎస్‌కే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌!!IPL 2021: ఇంగ్లండ్‌ మహిళ క్రికెటర్‌కు సీఎస్‌కే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌!!

ఐపీఎల్ నిరవధిక వాయిదా:

ఐపీఎల్ నిరవధిక వాయిదా:

కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్ 2021ను బీసీసీఐ మంగళవారం నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 60 మ్యాచుల టోర్నీలో 29 మ్యాచులు ముగిసిన తర్వాత ఆటగాళ్లు వైరస్‌ బారిన పడ్డారు. కోల్‌కతా బౌలర్లు సందీప్‌ వారియర్‌, వరుణ్‌ చక్రవర్తి.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ, బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ పాజిటివ్‌గా తేలారు. దీంతో బయో బుడగ బలహీనంగా మారింది. ఉన్నపళంగా సమావేశమైన బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి.. ఐపీఎల్ 2021ను వాయిదా వేసింది.

వాయిదా వేయండని ముందే చెప్పా:

వాయిదా వేయండని ముందే చెప్పా:

ఐపీఎల్ 2021 వాయిదా వేయడంపై పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్ అక్తర్‌ స్పందించాడు. ఓ వీడియో పోస్ట్ చేసి అందులో మాట్లాడాడు. 'ఐపీఎల్‌ 2021 నిరవధికంగా వాయిదా పడింది. ఇలా అవుతుందని నాకు ముందే తెలుసు. రెండు వారాల క్రితమే వాయిదా వేయాలని బీసీసీఐకి సూచించాను. భారత్‌లో ప్రస్తుత కరోనా సంక్షోభంలో మనుషుల ప్రాణాలు కాపాడటం కన్నా.. మరేదీ ముఖ్యం కాదు' అని అక్తర్‌ ట్వీట్ చేశాడు. ఐపీఎల్‌ రద్దవ్వడంతో మిగిలన 31 మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాల కోసం బీసీసీఐ ఆలోచిస్తుంది. కరోనా ఉధృతి తగ్గితే.. సెప్టెంబర్‌లో మ్యాచ్‌లు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

భారత్‌కు సహాయచేద్దాం:

భారత్‌కు సహాయచేద్దాం:

ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న భారత్‌కు సహాయచేద్దామని తన యూట్యుబ్ చానెల్ వేదికగా అక్తర్‌ పాక్ ప్రజలను ఇదివరకే కోరాడు. 'మా ప్రభుత్వం, అభిమానులను ఇండియాకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇండియాకు చాలా ఆక్సిజన్ ట్యాంకులు కావాలి. ప్రతి ఒక్కరూ ఇండియా కోసం విరాళాలు సేకరించి, వాళ్లకు అవసరమైన ఆక్సిజన్ ట్యాంకులను అందించాలని కోరుతున్నా' అని వీడియోలో అక్తర్ కోరాడు. అంతకుముందు కూడా ఇండియాలో కరోనా తీవ్రతను గమనించిన అక్తర్‌.. సాయం చేయాల్సిందిగా ప్రపంచ దేశాలను కోరాడు.

Story first published: Wednesday, May 5, 2021, 20:06 [IST]
Other articles published on May 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X