న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్లేస్‌మెంట్, టైమింగ్‌‌నే ఎక్కువ నమ్ముతా: టీ20ల్లో పేలవ బ్యాటింగ్ రికార్డుపై స్మిత్

Not power hitting, Steve Smith uses timing and placement to stay relevant in T20I cricket

హైదరాబాద్: టీ20ల్లో తన బ్యాటింగ్ రికార్డుని మరింతగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. టెస్టుల్లో స్టీవ్ స్మిత్ యావరేజి 60గా ఉండగా... వన్డేల్లో 40కిపైగా ఉంది. అయితే, టీ20ల్లో మాత్రం ఆ స్థాయిలో లేదు.

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ కల్లా పొట్ట ఫార్మాట్‌లో సత్తా చాటాలని ఊవిళ్లూరుతున్నాడు. తాజాగా ఐసీసీకి ఇచ్చిన ఇంటర్యూలో స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ "టీ20ల్లో నా బ్యాటింగ్ రికార్డులను గమనించినట్లైతే ఆకట్టుకునే విధంగా లేవు" అని అన్నాడు.

<strong>PHOTOS: రెండో పెళ్లి చేసుకున్న స్మిత్</strong>PHOTOS: రెండో పెళ్లి చేసుకున్న స్మిత్

అసలు టాలెంట్‌ను ఇంకా బయటకు రాలేదు

అసలు టాలెంట్‌ను ఇంకా బయటకు రాలేదు

30 ఏళ్ల స్టీవ్ స్మిత్ ప్రస్తుతం ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ... ఆ స్థాయి ప్రదర్శన ఇంతవరకు చేయనేలేదు. ఆసీస్ తరుపున 35 మ్యాచ్‌లాడిన స్మిత్ యావరేజి 27.48గా ఉంది. ఈ నెంబర్‌ స్మిత్‌లోని అసలు టాలెంట్‌ను ఇంకా బయటకు రాలేదని చెప్పాలి.

గతంలో లోయర్ ఆర్డర్‌లో

గతంలో లోయర్ ఆర్డర్‌లో

ఎందుకంటే అంతకముందు స్టీవ్ స్మిత్ లెగ్ స్పిన్నర్‌గా మరియు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడమే. అయితే, టీ20ల్లో ప్లేస్‌మెంట్, టైమింగ్‌తోనే మరింత రాణిస్తానని స్టీవ్ స్మిత్ చెప్పడం విశేషం. "మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. కెరీర్ ప్రారంభంలో నేను నెం. 8 లేదా 9 బ్యాటింగ్ చేసేవాడిని. దీంతో క్రీజులో కుదురుకునేందుకు అరడజనుకుపైగా బంతులు ఎదుర్కొనేవాడిని. ఇది అంత సులభం కాదు, కాబట్టి ఇది నా రికార్డుని ప్రభావితం చేస్తుంది" అని అన్నాడు.

నా సామర్థ్యాన్ని తక్కువ వేసుకోను

నా సామర్థ్యాన్ని తక్కువ వేసుకోను

"నా సామర్థ్యాన్ని నేను తక్కువ వేసుకోను. ఆట యొక్క టెంపోస్ నాకు తెలుసు. ఇప్పుడు నేను చాలా టీ20 క్రికెట్ ఆడాను. నేను కొందరి కుర్రాళ్ళలాగా బలంగా ఉండకపోవచ్చు, కానీ నేను ప్లేస్‌మెంట్, టైమింగ్‌ను నమ్ముకున్నాను" అని స్టీవ్ స్మిత్ వెల్లడించాడు.

పెర్త్ వేదికగా మూడో టీ20

పెర్త్ వేదికగా మూడో టీ20

కాగా, స్టీవ్ స్మిత్ (80 నాటౌట్; 51 బంతుల్లో 11 పోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించడంతో పాకిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో మూడు టీ20ల సిరిస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. పెర్త్‌ వేదికగా శుక్రవారం మూడో టీ20 జరగనుంది. గత ఆదివారం జరగాల్సిన తొలి టీ20కి వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, November 6, 2019, 14:16 [IST]
Other articles published on Nov 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X