న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీకి బంతులేసేది అలాగేనా?: ముంబై టీ20 ఓటమిపై పొలార్డ్ అసహనం!

India vs West Indies 3rd T20 : Didn't Execute As We Wanted Says Kieron Pollard || Oneindia Telugu

హైదరాబాద్: ముంబై వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టీ20లో విండిస్ ఓడిపోవడంతో ఆ జట్టు కెప్టెన్ కీరన్‌ పొలార్డ్‌ అసహనం వ్యక్తం చేశాడు. తమ చేతుల్లో వికెట్లు ఉండి ఉంటే కచ్చితంగా గెలిచి ఉండేవాళ్లమని చెప్పుకొచ్చాడు. తమ ప్రణాళికల్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలం కావడంతోనే ఈ మ్యాచ్‌లో ఓడిపోయామని తెలిపాడు.

మ్యాచ్ అనంతరం ఓటమిపై కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ "భారత జట్టులో క్లాస్‌ ఆటగాళ్లు ఉన్నప్పుడు బౌలింగ్‌ అనేది ఎంతో నియంత్రణతో ఉండాలి. అటువంటిది మా బౌలర్లు పూర్తిగా లైన్‌ తప్పారు. ముఖ్యంగా కోహ్లీకి అతనే ఆడే స్లాట్‌లోనే పలు బంతుల్ని వేయడం సరైనది కాదు. కోహ్లీ ఒక అసాధారణ బ్యాట్స్‌మన్‌" అని కొనియాడాడు.

డ్రెస్సింగ్ రూమ్ నుంచి కుమార్తె సమైరాతో మాట్లాడిన రోహిత్ శర్మ (వీడియో)డ్రెస్సింగ్ రూమ్ నుంచి కుమార్తె సమైరాతో మాట్లాడిన రోహిత్ శర్మ (వీడియో)

కోహ్లీకి చెత్త బంతులు వేస్తే

కోహ్లీకి చెత్త బంతులు వేస్తే

"కోహ్లీకి చెత్త బంతులు వేస్తే వాటిని బౌండరీ ద్వారానే సమాధానం చెబుతాడు. తాము తమ ప్రణాళికల్ని అమలు చేసే ఉంటే అసలు ఈ చర్చే ఉండేది కాదు. ఈ మ్యాచ్‌లో విజయానికి భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. తాము టీ20 సిరీస్‌ను మొదలు పెట్టినప్పుడు సిరీస్‌ ఫలితం చివరి వరకూ వెళుతుందని అనుకోలేదు" అని పొలార్డ్ తెలిపాడు.

240 పరుగులు పెద్ద స్కోరేమీ కాదు

240 పరుగులు పెద్ద స్కోరేమీ కాదు

"భారత్‌ చేసిన 240 పరుగులు పెద్ద స్కోరేమీ కాదు. తమ చేతుల్లో వికెట్లు ఉండి ఉంటే కచ్చితంగా గెలిచి ఉండేవాళ్లం. తమ బ్యాట్స్‌మెన్ మరింత నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది. వన్డే సిరీస్‌లో ప్రణాళికల్ని అమలు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాం" అని కీరన్ పొలార్డ్‌ చెప్పుకొచ్చాడు.

173 పరుగులకే పరిమితమైన విండిస్

173 పరుగులకే పరిమితమైన విండిస్

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు భారత జట్టులో రోహిత్‌ శర్మ (34 బంతుల్లో 71), కేఎల్‌ రాహుల్ (56 బంతుల్లో 91) రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండిస్ 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది.

ఆదివారం నుంచి మూడు వన్డేల సిరిస్

ఆదివారం నుంచి మూడు వన్డేల సిరిస్

దీంతో టీమిండియా మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అంతకముందు హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించగా... తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండిస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే చెన్నై వేదికగా ఆదివారం జరగనుంది.

Story first published: Thursday, December 12, 2019, 13:17 [IST]
Other articles published on Dec 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X