న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అది మా తప్పు కాదు!: భారత్ విజయాన్ని తక్కువ చేసే వారికి సన్నీ గట్టి కౌంటర్

India vs Australia: Sunil Gavaskar: Not India's Fault If Steve Smith And David Warner Weren't Picked
Not Indias Fault If Steve Smith And David Warner Werent Picked: Sunil Gavaskar

హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీసేన సాధించిన చారిత్రక విజయాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్న విమర్శలను మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ తిప్పికొట్టాడు. స్టీవ్ స్మిత్‌, డేవిడ్ వార్నర్‌పై నిషేధం పడకుండా ఉండి ఉంటే.. ఈ టెస్టు సిరిస్‌లో పరిస్థితులు మరో రకంగా ఉండేవని కొందరు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

'ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరిస్ నెగ్గడం 1983 వరల్డ్ కప్ విజయం కంటే గొప్పది''ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరిస్ నెగ్గడం 1983 వరల్డ్ కప్ విజయం కంటే గొప్పది'

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులో స్మిత్, వార్నర్‌ లేకపోవడం భారత్‌ తప్పు కాదని, వారిపై తక్కువ సమయం పాటు నిషేధం విధించాల్సిందని గవాస్కర్ సూచించాడు. గవాస్కర్ మాట్లాడుతూ "'స్మిత్‌, వార్నర్‌ గైర్హాజరీతో బలహీనపడ్డ ఆస్ట్రేలియా మీద టీమ్‌ఇండియా సిరీస్‌ గెలిచింది అనే వ్యాఖ్యల్లో అర్థం లేదు" అని అన్నాడు.

భారత జట్టు తప్పు కాదు కదా

భారత జట్టు తప్పు కాదు కదా

"వాళ్లు జట్టులో లేకపోడం భారత జట్టు తప్పు కాదు కదా. ఆస్ట్రేలియా ఎంపిక చేసిన జట్టుతో తలపడి భారత్‌ విజేతగా నిలిచి గొప్ప ఘనత సాధించింది. తమకు ఎదురైన ప్రత్యర్థితో తలపడటమే ఆటగాళ్ల పని. టీమిండియా సాధించిన విజయం గొప్ప ఘనతగా చెప్పవచ్చు. మా రోజుల్లో మేం కూడా విజయాల కోసమే ఆడేవాళ్లం" అని సునీల్ గవాస్కర్ అన్నాడు.

ఫిట్‌నెస్‌ విషయంలో అత్యుత్తమం

ఫిట్‌నెస్‌ విషయంలో అత్యుత్తమం

"కానీ ప్రస్తుత జట్టు ఫిట్‌నెస్‌ విషయంలో అత్యుత్తమంగా ఉంది. కెప్టెన్‌ కోహ్లీ జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు" అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌ వర్షం కారణంగా ఈరోజు డ్రాగా ముగియగా.. నాలుగు టెస్టుల సిరీస్‌ని టీమిండియా 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

12 సార్లు వెళ్లిన భారత్ జట్టు

12 సార్లు వెళ్లిన భారత్ జట్టు

1947 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకి 12 సార్లు వెళ్లిన భారత్ జట్టు.. అక్కడ టెస్టు సిరీస్‌ గెలవడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్‌ టెస్టు సిరిస్‌ను డ్రా చేసుకోగలిగింది కానీ, విజయం మాత్రం సాధించలేదు. ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో టీమిండియా 7 టెస్టుల్లో విజయం సాధించింది.

72 ఏళ్ల నిరీక్షణకు తెర

72 ఏళ్ల నిరీక్షణకు తెర

దీంతో ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆస్ట్రేలియా జట్టుని ఆస్ట్రేలియాలో తొలిసారి ఓడించి టీమిండియా సగర్వంగా నిలిచింది. ఈ సిరిస్‌లో టీమిండియా సమిష్టి ప్రదర్శన చేసింది. పుజారాతో పాటు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 350 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 282 పరుగులతో ఫరవాలేదనిపించాడు. ఇక, భారత్ ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా 21 వికెట్లతో కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాల్ని నమోదు చేయగా షమీ 16, ఇషాంత్ 11 వికెట్లు పడగొట్టారు.

Story first published: Tuesday, January 8, 2019, 10:26 [IST]
Other articles published on Jan 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X