న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రాడ్ హాగ్ వరల్డ్‌ టెస్టు ఎలెవన్‌.. నలుగురు భారత ఆటగాళ్లకు చోటు.. కోహ్లీ మాత్రం లేడు!!

No Virat Kohli In Brad Hoggs Current World Test XI, Rohit Sharma Among 4 Indians

సిడ్నీ: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. ఇప్పుడు లాక్‌డౌన్ సమయంలో ఖాళీగా ఉండడంతో పలువురు ప్రకటిస్తున్నారు. ఆస్ట్రేలియా ఆట‌గాడు ఆస్ట‌న్ అగ‌ర్, దక్షిణాఫ్రికా వెటరన్‌ పేస్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్, శ్రీలంక మాజీ ఆటగాడు తిలకరత్నె దిల్షాన్ ప్ర‌పంచ అత్యుత్త‌మ క్రికెట్ జ‌ట్టును ప్రకటించగా.. తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ వరల్డ్‌ టెస్టు ఎలెవన్‌ జట్టును ప్రకటించాడు.

'ఇంగ్లండ్ క్రికెట్‌ ఎదిగేందుకు ఐపీఎల్‌ సహకరించింది.. ప్రపంచకప్‌ల తర్వాత అదే అత్యుత్తమం''ఇంగ్లండ్ క్రికెట్‌ ఎదిగేందుకు ఐపీఎల్‌ సహకరించింది.. ప్రపంచకప్‌ల తర్వాత అదే అత్యుత్తమం'

నలుగురు భారత క్రికెటర్లకు చోటు:

నలుగురు భారత క్రికెటర్లకు చోటు:

బ్రాడ్‌ హాగ్‌ తన వరల్డ్‌ టెస్టు ఎలెవన్ జట్టులో నలుగురు భారత క్రికెటర్లకు చోటి కల్పించాడు. రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, అజింక్యా రహానే, మహ్మద్‌ షమీలకు జట్టులో చోటిచ్చాడు. ఓపెనర్లగా మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌లను తీసుకున్న హాగ్.. మిడిల్‌ ఆర్డర్‌లో రహానేకు చాన్స్‌ ఇచ్చాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో భారత్‌ నుంచి షమీకి చోటిచ్చాడు. ఆసీస్‌ నుంచి నలుగురి క్రికెటర్లను హాగ్‌ ఎంపిక చేసుకున్నాడు. అందులో మార్నస్ లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ప్యాట్‌ కమిన్స్‌, నాధన్‌ లయాన్‌లు ఉన్నారు.

బాబర్‌ అజామ్‌కు అవకాశం:

బాబర్‌ అజామ్‌కు అవకాశం:

పాకిస్తాన్‌ క్రికెట్‌ నుంచి బాబర్‌ అజామ్‌కు అవకాశం ఇవ్వగా.. దక్షిణాఫ్రికా నుంచి క్వింటన్ డీకాక్‌ను ఎంపిక చేశాడు. వీరిద్దరూ బ్యాటింగ్ విభాగంలోకి ఎంచుకున్నాడు. ఇక న్యూజిలాండ్‌ నుంచి నీల్‌ వాగ్నర్‌ను బౌలర్‌గా తీసుకున్నాడు. బ్రాడ్‌ హాగ్‌ తన వరల్డ్‌ టెస్టు ఎలెవన్ జట్టులో ఆసీస్, భారత్ జట్లకు పెద్దపీఠ వేసాడు. ఇక ఇంగ్లండ్, విండీస్, బంగ్లా జట్ల నుండి ఒక్కరిని కూడా ఎంపిక చేసుకోలేదు. అయితే తన వరల్డ్‌ ఎలెవన్‌ జట్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కోటివ్వకపోవడం అందరిని ఆశ్చర్యంకు గురిచేస్తుంది.

కోహ్లీ ఫామ్‌లో లేడు:

కోహ్లీ ఫామ్‌లో లేడు:

అసలు విరాట్ కోహ్లీని తన జట్టులోకి ఎందుకు తీసుకోలేదనే దానిపై హాగ్‌ వివరణ ఇచ్చాడు. 'కోహ్లీని జట్టులో తీసుకోలేకపోవడంపై ప్రతీ ఒక‍్కరూ ప్రశ్నించే అవకాశం ఉంది. గత 15 టెస్టు ఇన్నింగ్స్‌ చూస్తే.. కేవలం నాలుగుసార్లు మాత్రమే 31 పరుగులు మించి చేశాడు. ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో పెట్టుకునే నా జట్టులో చోటు కల్పించలేదు' అని తెలిపాడు. 'మయాంక్‌ కవర్‌ డ్రైవ్స్‌ అంటే నాకు ఇష్టం. రోహిత్‌ శర్మను ఎంపిక చేయడానికి ఆలోచించా. భారత్‌లో టెస్టు క్రికెట్‌లో రోహిత్‌ సుమారు 90పైగా సగటు కల్గి ఉన్నాడు. అందుచేత రోహిత్‌కు నా తుది జట్టులో చోటు దక్కింది' అని హాగ్‌ తెలిపాడు. బ్రాడ్ హాగ్ ఇటీవలే ఆల్ టైం ఐపీఎల్‌ జట్టును ప్రకటించాడు.

బ్రాడ్ హాగ్ వరల్డ్‌ టెస్టు ఎలెవన్:

బ్రాడ్ హాగ్ వరల్డ్‌ టెస్టు ఎలెవన్:

రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, అజింక్యా రహానే, మహ్మద్‌ షమీ, మార్నస్ లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ప్యాట్‌ కమిన్స్‌, నాధన్‌ లయాన్, బాబర్‌ అజామ్, క్వింటన్ డీకాక్, నీల్‌ వాగ్నర్‌.

బ్రాడ్ హాగ్ ఆల్ టైం ఐపీఎల్‌ జట్టు:

బ్రాడ్ హాగ్ ఆల్ టైం ఐపీఎల్‌ జట్టు:

రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, ఏబీ డివిల్లీర్స్, ఎంఎస్ ధోనీ, సునీల్ నరైన్, రషీద్ ఖాన్, మునాఫ్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Saturday, May 23, 2020, 18:11 [IST]
Other articles published on May 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X