న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Aakash Chopra:న్యూజిలాండ్‌ను ఓడించే వరల్డ్ టెస్ట్ ఎలెవన్ ఇదే..భారత్ నుంచి ముగ్గురు..కోహ్లీకి నోచాన్స్!

No Virat Kohli among 3 Indians in Aakash Chopras World XI to beat WTC winners New Zealand

న్యూఢిల్లీ: ఎన్నో అంచనాల మధ్య ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో బరిలోకి దిగిన భారత జట్టు పేలవ ఆటతీరుతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. రెండేళ్లుగా సాగిన టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన కోహ్లీసేన.. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో మాత్రం తడబడి విశ్వవిజేతగా నిలిచే సువర్ణవకాశాన్ని చేజార్చుకుంది. ఇక కలిసొచ్చిన పరిస్థితుల మధ్య ప్రణాళికల మేరకు రాణించిన కేన్ విలియమ్సన్ సేన విజేతగా నిలిచి ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది.

అయితే డబ్ల్యూటీసీ విజేతగా నిలిచిన న్యూజిలాండ్‌ను ఓడించే వరల్డ్ బెస్ట్ టెస్ట్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ప్రకటించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆ వివరాలను అభిమానులతో పంచుకున్నాడు.

కోహ్లీకి నో చాన్స్..

కోహ్లీకి నో చాన్స్..

ఈ వరల్డ్ బెస్ట్ ఎలెవన్‌లో భారత్‌ నుంచి ముగ్గురు ఆటగాళ్లనే ఎంపిక చేసిన చోప్రా.. ఆశ్చర్యకరంగా విరాట్ కోహ్లీకి చోటివ్వలేదు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ‌ను ఓపెనర్‌గా తీసుకున్న చోప్రా... వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్, స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌లను మాత్రమే ఎంపిక చేశాడు. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానేతో పాటు ఒక్క పేసర్‌ను కూడా పరిగణలోకి తీసుకోలేదు. 'నాలుగో స్థానంలో ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జోరూట్‌ను తీసుకున్నా.

విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్‌లకు అవకాశం ఇవ్వలేదు. జోరూట్ డబ్ల్యూటీసీలో 1660 పరుగులు చేశాడు. అతను ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మాట వాస్తవమే. కానీ ఓ ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ అయిన రూట్.. ఆసియా గడ్డపై దుమ్మురేపాడు. భారత్, శ్రీలంకపై డబుల్ సెంచరీలు బాదాడు. అది అంత సులువైన పనికాదు. అందుకే అతన్ని తీసుకున్నా.

ఓపెనర్‌గా రోహిత్ శర్మ..

ఓపెనర్‌గా రోహిత్ శర్మ..

'ఓపెనర్లుగా రోహిత్ శర్మ, దిముత్ కరుణ రత్నేలను‌ ఎంపిక చేశాను. డబ్ల్యూటీసీ టోర్నీలో రోహిత్ శర్మ సగటు 60తో 12 మ్యాచ్‌ల్లో 1094 రన్స్ చేసి హయ్యెస్ట్ రన్స్ చేసిన లిస్ట్‌లో ఆరో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇందులో నాలుగు సెంచరీలతో పాటు ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది.

అతనికి తోడుగా తీసుకున్న కరుణరత్నే 55.5 సగటుతో 999 రన్స్ చేశాడు. మూడో ప్లేస్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ మార్నస్ లబుషేన్‌ను ఎంపిక చేశాను. అతను డబ్ల్యూటీసీలో 72 సగటుతో 1675 రన్స్ చేశాడు. ఇందులో ఐదు సెంచరీలున్నాయి.

రిషభ్ పంత్‌కు చాన్స్..

రిషభ్ పంత్‌కు చాన్స్..

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఐదో ప్లేస్‌లో తీసుకున్నాను. అతను 63 సగటుతో 1341 రన్స్ చేశాడు. నాలుగు సెంచరీలతో పాటు.. యాషెస్ సిరీస్‌లో ఓ టెస్ట్ మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. భారత్‌పై పరుగులు చేశాడు. ఆరో స్థానంలో జాసన్ హోల్డర్, రవీంద్ర జడేజాలను కాదని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తీసుకున్నాను. ఎందుకంటే అతను 1334 పరుగులతో స్టీవ్ స్మిత్ చేసినన్న రన్స్ చేశాడు. అంతేకాకుండా వికెట్లు కూడా తీసాడు. వికెట్ కీపర్‌గా బట్లర్ రాణించినా.. నేను రిషభ్ పంత్‌ను ఎంచుకున్నాను. అతను 40 సగటుతో 700 పైగా రన్స్ చేశాడు. ఇంగ్లండ్‌ గడ్డపై సెంచరీతో పాటు గేమ్ చేంజర్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు.

ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్..

ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్..

ఈ వరల్డ్ బెస్ట్ ఎలెవన్‌లో ఏకైక స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశం ఇచ్చాను. అతను డబ్ల్యూటీసీ టోర్నీలో 14 మ్యాచ్‌‌ల్లో 71 వికెట్లతో అద్భుతంగా రాణించాడు. ప్రధాన పేసర్లుగా ప్యాట్ కమిన్స్, స్టువర్డ్ బ్రాడ్‌తో పాటు జోష్ హజెల్‌వుడ్‌ను తీసుకున్నా. కమిన్స్ 70 వికెట్లు తీయగా.. స్టువర్ట్ బ్రాడ్ 20 సగటుతో 69 వికెట్లు తీశాడు. అదనపు పేసర్ విషయంలో షమీ, స్టార్క్, హజెల్ వుడ్, నోర్జ్‌ల్లో ఎవరినీ తీసుకోవాలనేదానిపై కొంత గందరగోళానికి గురయ్యా. అయితే షమీ కేవలం ఒకే ఫిఫర్ తీయడంతో హజెల్‌వుడ్‌ను తీసుకున్నా'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

ఆకాశ్ చోప్రా వరల్డ్ ఎలెవన్: రోహిత్ శర్మ, దిముత్ కరుణరత్నే, మార్నస్ లబుషేన్, జో రూట్(కెప్టెన్), స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, రిషభ్ పంత్, ప్యాటి కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్, స్టువర్ట్ బ్రాడ్, జోష్ హజెల్ వుడ్

Story first published: Tuesday, June 29, 2021, 12:48 [IST]
Other articles published on Jun 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X