న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దూస్రాను కనిపెట్టిందే ముస్తాక్‌.. నిజమైన మ్యాచ్‌ విన్నర్‌ అతడే: హర్భజన్‌

No one could pick his doosra, Harbhajan on Pakistan off-spinner Saqlain Mushtaq

ముంబై: పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ సక్లయిన్‌ ముస్తాక్‌పై టీమిండియా వెటరన్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ ప్రశంసలు కురిపించాడు. పాక్‌ దిగ్గజ క్రికెటర్లలో ఒకడైన ముస్తాక్‌.. ఒంటి చేత్తో ఆ దేశానికి ఎన్నో విజయాలు అందించాడన్నాడు. దూస్రాను కనిపెట్టిందే ముస్తాక్‌ అని, అతను నిజమైన మ్యాచ్‌ విన్నర్‌ అని భజ్జీ పేర్కొన్నాడు. హర్భజన్‌ టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో పాల్గొని పలు విషయాలు చర్చించాడు.

ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవలేదు.. కోహ్లీపై వార్నర్ సెటైర్!!ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవలేదు.. కోహ్లీపై వార్నర్ సెటైర్!!

లైవ్‌ సెషన్ సందర్భంగా గ్రేట్‌ ఆఫ్‌ స్పిన్నర్లు గురించి నీ అభిప్రాయం చెప్పమని భజ్జీని రోహిత్ కోరాడు. శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ ముత్తయ మురళీధరన్‌ను గ్రేట్‌ ఆఫ్‌ స్పిన్నర్‌గా హర్భజన్‌ ఎంచుకున్నాడు. ఆ తర్వాత​ నాథన్‌ లయాన్‌, గ్రేమ్‌ స్వాన్‌ పేర్లను భజ్జీ సూచించాడు. ముస్తాక్‌ గురించి అభిప్రాయం అడగ్గా...'ముస్తాక్‌ ఒక గ్రేట్‌ ఆఫ్‌ స్పిన్నర్‌. అతని నుంచి వచ్చే దూస్రాను ఎవరూ ఆడాలనే అనుకోరు. అతనొక నిజమైన మ్యాచ్‌ విన్నర్‌. దూస్రాను కనిపెట్టిందే ముస్తాక్‌' అని సంధానం ఇచ్చాడు.

ముస్తాక్‌ గురించి భజ్జీ ఇంకా మాట్లాడుతూ... 'వన్డేల్లో 45 నుంచి 50 ఓవర్ల మధ్యలో ముస్తాక్‌ బౌలింగ్‌ చాలా ప్రమాదకరం. ఆ సమయంలో ముస్తాక్‌ను ఎటాక్‌ చేయడం కష్టంగా ఉండేది. ఆ ఓవర్ల మధ్యలోనే మ్యాచ్‌ను ముస్తాక్‌ మలుపు తిప్పి పాకిస్తాన్‌కు విజయాలను అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి' అని పేర్కొన్నాడు. ఇక భారత ఆఫ్‌ స్పిన్నర్ల విషయానికొస్తే ప్రస్తుతం రవి చంద్రన్‌ అశ్విన్‌ అని పేర్కొన్నాడు. ఈ వరుసలో చాలా మంది భారత స్పిన్నర్లు ఉన్నారని, ముంబై ఇండియన్స్‌ తీసుకున్న అక్షయ్‌ వాఖేరే మంచి స్పిన్నర్‌గా ఎదుగుతాడన్నాడు.

విద‌ర్భ ఆఫ్‌స్పిన్న‌ర్ అక్ష‌య్ వాఖ‌రే‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ ప్ర‌శంస‌లు కురిపించాడు. ఇటీవ‌లి కాలంలో నిల‌క‌డగా రాణిస్తున్న అక్ష‌య్ భ‌విష్య‌త్తులో మ్యాచ్ విన్న‌ర్ అవుతాడ‌ని భ‌జ్జీ అన్నాడు. 'అత‌డి బౌలింగ్‌లో మంచి బౌన్స్ ఉంది. అది టెస్టు క్రికెట్‌కు స‌రిగ్గా స‌రిపోతుంది. ఎస్‌జీ బంతితో అత‌డు విజృంభించ‌గ‌ల‌డ‌ని నా న‌మ్మ‌కం. సుదీర్ఘ ఫార్మాట్‌లో అవ‌కాశ‌మొస్తే అత‌డు మ్యాచ్ విన్నర్ అవుతాడు' అని అన్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియ‌న్స్‌కు ఆడే స‌మ‌యంలో వాడ్క‌ర్‌ను ద‌గ్గ‌ర నుంచి ప‌ర‌శీలించిన‌ట్లు భ‌జ్జీ తెలిపాడు.

Story first published: Saturday, April 25, 2020, 17:38 [IST]
Other articles published on Apr 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X