న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గైడ్‌లైన్స్ అందలేదు: ఆటగాళ్లకు పని భారంపై తేల్చి చెప్పిన కేకేఆర్ సీఈఓ

No guidelines received yet, KKR CEO Venky Mysore on players workload management

హైదరాబాద్: ఐపీఎల్ విషయంలో ఎప్పుడు ఒక విమర్శ ఉంటుంది. ఆటాగాళ్ళు ఐపీఎల్లో ఆడటం వల్లన గాయాల పాలై జాతీయ క్రికెట్కు దూరమవుతున్నారని. అప్పట్లో ఆటగాళ్లకు గాయాలు అయినా దాచిపెట్టి ఐపీఎల్‌లో ఆడిస్తున్నారని విమర్శలు కూడా వచ్చాయి.

<strong>పాండ్యా కంటే స్టోయినిసే గొప్ప: మొదలైన ఆసీస్ కవ్వింపు చర్యలు</strong>పాండ్యా కంటే స్టోయినిసే గొప్ప: మొదలైన ఆసీస్ కవ్వింపు చర్యలు

అయితే ఇదే విషయం మీద కోల్‌కతా నైట్‌రైడర్స్ సీఈో వెంకీ మైసూర్ మాట్లాడుతూ "కీలక ఆటగాళ్ల పై పని భారం తగ్గించే అంశాల గురించి మాకు ఎటువంటి ఆదేశాలు అందలేదు" అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో ఆటగాళ్ల పై పని ఒత్తిడి పెరిగే అవకాశమే లేదని చెప్పుకొచ్చాడు.

18 మంది కీలక ఆటగాళ్లపై పనిభారాన్ని తగ్గించేందుకు దాని ప్రభావం వరల్డ్ కప్ మీద పడకుండా బీసీసీఐ.. అన్ని ఫ్రాంచైజీలతో మాట్లాడుతుందని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వెంకీ పైవిధంగా స్పందించారు. మాకు ఎలాంటి ఆదేశాలు అందలేదని, అయినా ఐపీఎల్ చాలా ముందుగానే ముగుస్తుందని చెప్పాడు.

మే 12న ఫైనల్ అయితే జూన్ 5న ప్రపంచకప్ మ్యాచ్ ఉంటుందని, ఐపీఎల్‌కు ప్రపంచ కప్ మొదలవ్వటానికి సుమారు మూడు వారాలు సమయం ఉందని అలాంటప్పుడు ఆటగాళ్లు అలిసి పోయే అవకాశం లేదని తెలిపారు. పనిభారం విషయంలో బీసీసీఐ ఒత్తిడి తెస్తుందని తాము అనుకోవడం లేదన్నాడు. నెట్ సెషన్స్ కంటే పోటీ క్రికెట్ ఆడితేనే క్రికెటర్లకు మేలు జరుగుతుందన్నాడు.

Story first published: Wednesday, February 20, 2019, 12:28 [IST]
Other articles published on Feb 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X