న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కౌంటీ క్రికెట్‌‌లో కోహ్లీ ఆడటం లేదని స్పష్టం చేసిన బీసీసీఐ

 No county action for injured Virat Kohli, fitness test on June 15

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కౌంటీ క్రికెట్‌కు దూరమయ్యాడు. కోహ్లీ ఆరోగ్యం బాగాలేదంటూ .. కౌంటీ క్రికెట్‌కు అతని ఆరోగ్యం సరిపడదంటూ వైద్యులు ముందుగానే వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు. సర్రే తరఫున కౌంటీలు ఆడాల్సి ఉండగా.. మెడ గాయం కారణంగా కోహ్లి ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది.

మ్యాచ్‌లో విరాట్ గాయపడ్డాడని

మ్యాచ్‌లో విరాట్ గాయపడ్డాడని

ఐపీఎల్‌లో భాగంగా మే17న జరిగిన బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ గాయపడ్డాడని బోర్డు తెలిపింది. స్కానింగ్, ఇతర వైద్య పరీక్షల అనంతరం మెడికల్ టీం ఈ విషయాన్ని నిర్ధారించిందని బీసీసీఐ వివరించింది. బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో విరాట్ కోహ్లి చికిత్స పొందనున్నాడు.

 ఫిట్‌నెస్ టెస్టులో పాల్గొననున్న కోహ్లి

ఫిట్‌నెస్ టెస్టులో పాల్గొననున్న కోహ్లి

జూన్ 15న బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోహ్లి ఫిట్‌నెస్ టెస్టులో పాల్గొననున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని బీసీసీఐ మెడికల్ టీం విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

ఏడాది కాలంగా విరాట్ కోహ్లి తీవ్ర పని ఒత్తిడి

ఏడాది కాలంగా విరాట్ కోహ్లి తీవ్ర పని ఒత్తిడి

ఏడాది కాలంగా విరాట్ కోహ్లి తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. సంవత్సర కాలంలో 9 టెస్టులు, 29 వన్డేలు, 9 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. కోహ్లి ఏడాదిలో మొత్తం 47 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. భారత ఆటగాళ్లలో రోహిత్, హార్దిక్ మాత్రమే అతడి కంటే ఒక మ్యాచ్ ఎక్కువ ఆడారు.

జూలై మొదటి వారంలో భారత జట్టు:

జూలై మొదటి వారంలో భారత జట్టు:

ఇంగ్లాండ్ వాతావరణానికి అలవాటు పడేందుకు.. సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ తరఫున మూడు లిస్ట్ ఏ, మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడేందుకు కోహ్లి ఒప్పందం చేసుకున్నాడు. జూలై మొదటి వారంలో భారత జట్టు ఇంగ్లాండ్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

Story first published: Thursday, May 24, 2018, 16:27 [IST]
Other articles published on May 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X