న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చార్జ్‌షీట్‌ను పరిశీలించేవరకు షమీపై ఎటువంటి చర్యలు తీసుకోము: బీసీసీఐ

No action against Indian cricketer Mohammed Shami till we see charge sheet says BCCI

కోల్‌కతా: టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కలకత్తాలోని అలిపోర్ కోర్టు షమీపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. షమీతో పాటు అతడి సోదరుడు హసిద్ అహ్మద్‌కు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇద్దరు 15 రోజుల్లో కోర్టు ఎదుట లొంగిపోవాలని అలిపోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్!!టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్!!

15 రోజులు గడువు:

15 రోజులు గడువు:

మహ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ పెట్టిన గృహ హింస కేసులో 15 రోజుల్లో కోర్టు ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 15 రోజులు గడువు ఇచ్చింది. ఒకవేళ ఈ 15 రోజుల సమయంలో కోర్టు ఎదుట హాజరుకాని పక్షంలో షమీ, అతని సోదరుడిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

కేసు నమోదు:

కేసు నమోదు:

గత ఏడాది మార్చిలో షమీ భార్య హసీన్ అతనికి అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించింది. ఇందుకు సంబంధించి పలు వాట్సాప్ ఛాటింగ్ స్ర్కీన్ షాట్‌లు, ఫొటోలు కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అంతేకాక.. షమీ, అతని కుటుంబ సభ్యులు తనపై హత్యాయత్నం చేశారని, లైంగికంగా వేధించారని ఆమె గృహహింస కేసు పెట్టింది. దీంతో షమీతో పాటు అతని సోదరునిపై ఐపీసీ 498ఏ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

చార్జ్‌షీట్‌ను పరిశీలించాకే:

చార్జ్‌షీట్‌ను పరిశీలించాకే:

షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. చార్జ్‌షీట్‌ను పరిశీలించేవరకు షమీపై ఎటువంటి చర్యలు తీసుకోము అని స్పష్టం చేసింది. షమీ ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్నాడు. చివరి టెస్టులో అతను ఆడాడు. 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్ తరఫున షమీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, September 3, 2019, 8:51 [IST]
Other articles published on Sep 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X