న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాషింగ్టన్ సుందర్ రూపంలో భారత్‌కు కొత్త స్పిన్నర్ దొరికాడా?

By Nageshwara Rao
Nidahas Trophy: Washington Sundar emerging as tournaments MVP

హైదరాబాద్: పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు వాషింగ్టన్ సుందర్ రూపంలో మరో స్పిన్నర్‌ దొరికాడా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌‌ను ఫైనల్‌కు చేర్చడంలో వాషింగ్టన్ సుందర్ తన వంతు పాత్ర పోషించాడు.

India vs Bangladesh 2018 Match 5 Score Card

తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల ఈ యువ స్పిన్నర్ ఇప్పటివరకు తాను ఆడిన ఐదు టీ20ల్లో నమోదు చేసిన గణాంకాలు 1/22, 2/28, 0/23, 1/21, 3/22గా ఉన్నాయి. ఐదు మ్యాచ్‌ల తర్వాత కూడా అతడి ఎకానమీ 5.87గా ఉండటం విశేషం. నిజానికి టీ20ల్లో ఈ ఎకానమీతో సాగడం అంత ఈజీ విషయం కాదు.

బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన సుందర్ 3 వికెట్లు తీసి 22 పరుగులిచ్చాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను సుందర్ చావుదెబ్బ కొట్టడంతో 6 ఓవర్లకు 48 పరుగులు చేసి 3 వికెట్లు చేజార్చుకుంది.

సుందర్ బౌలింగ్‌లో ఓపెనర్ లిటన్ దాస్(7) స్టంప్ ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సౌమ్యా సర్కార్(1) సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం కీలక ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(27) మళ్లీ సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఇలా ఈ టోర్నీలో 16 ఓవర్లు వేసిన సుందర్ అందులో 11 ఓవర్లు పవర్ ప్లేలోనే వేయడం విశేషం.

టీమిండియా స్పిన్నర్లు చాహల్‌, కుల్దీప్‌ తరహాలోనే బంతుల్లో వైవిధ్యం చూపిస్తూ.. బంతిని బాగా స్పిన్‌ చేస్తూ.. ఫ్లైటెడ్‌ డెలివరీలతో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తోన్న చైనామన్ స్పిన్నర్ యుజువేంద్ర చాహాల్ కన్నా సుందర్‌ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు.

ఈ సిరీస్‌ను టీమిండియా రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించుకునేందుకు వినియోగించుకుంటున్న జట్టు మేనేజ్‌మెంట్ మిగతా స్థానాల్లో ఆటగాళ్లను మారుస్తూ సాగుతోంది కానీ.. వాషింగ్టన్ సుందర్‌ నిలకడగా రాణిస్తుండటంతో అతడిని మాత్రం భారత్ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ కొనసాగించింది.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన సుందర్:

Over 1.5: Liton Das st Karthik b Washington Sundar. The off-spinner sees the Bangladesh opener shimmying down the track and bowls shorter and wider, away from the reach of Das. Karthik completes simplest of stumping.

Over 3.4: Soumya Sarkar b Washington Sundar. It is partly the batsman's mistake as he swings wildly against a dart on the leg stump. Accuracy wins the battle this time for Sundar as leg stump is rattled.

Over 5.4: Tamil Iqbal b Washington Sundar. The Bangladesh southpaw walks down the pitch and tries to deposit Sundar over short fine leg. Tamim misses the shot and leg stump is disturbed once again. Accurate rather than being fancy.

Story first published: Thursday, March 15, 2018, 12:42 [IST]
Other articles published on Mar 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X